ఐ యామ్‌ బ్యాక్‌ | ‘I’M BACK:’ ARNOLD SCHWARZENEGGER GIVES UPDATE AFTER HEART SURGERY | Sakshi
Sakshi News home page

ఐ యామ్‌ బ్యాక్‌

Apr 16 2018 1:07 AM | Updated on Apr 16 2018 1:07 AM

‘I’M BACK:’ ARNOLD SCHWARZENEGGER GIVES UPDATE AFTER HEART SURGERY - Sakshi

ఆర్నాల్డ్‌ స్క్వార్జ్‌నెగ్గర్‌

...కామన్‌ ఆడియన్స్‌కు ఇది మామూలు ఫ్రేస్‌ కావొచ్చు. కానీ ఆర్నాల్డ్‌ స్క్వార్జ్‌నెగ్గర్‌ అభిమానులకు, ‘టెర్మినేటర్‌’ మూవీ సిరీస్‌ ఫ్యాన్స్‌కు ‘ఐ యామ్‌ బ్యాక్‌’ అనే లైన్‌ ఒక ఎమోషన్‌. ‘ఐ యామ్‌ బ్యాక్‌’ అనే పంచ్‌లైన్‌ ఆర్నాల్డ్‌ ఫస్ట్‌ ‘టెర్మినేటర్‌’ సినిమాలోనే వాడారు. సినిమా రిలీజై పెద్ద హిట్‌ అయిన తర్వాత నుంచి ఈ లైన్‌ ఆర్నాల్డ్‌ స్టైల్‌ స్టైట్‌మెంట్‌లో ఒక భాగమైపోయింది. ఈ మధ్య ఆర్నాల్డ్‌ ఆరోగ్యం కొంచెం దెబ్బతింది. దాంతో హార్ట్‌ సర్జరీ చేయించుకున్నారు. ఆ ఆపరేషన్‌ ఎలా జరిగింది? ఆర్నాల్డ్‌ ఎలా ఉన్నారు? అని ఆయన అభిమానులు ఆందోళన చెందారు.

దాంతో ఆర్నాల్డ్‌ తన ఫ్యాన్స్‌ కోసం తన హెల్త్‌ గురించిన అప్‌డేట్‌ ఇవ్వాలని ‘ఐ యామ్‌ బ్యాక్‌’ అంటూ ఓ వీడియో పోస్ట్‌ చేశారు. ‘‘మెసేజ్‌లు, ఫోన్‌ కాల్స్, కార్డ్స్, ఈ మెయిల్స్‌ ద్వారా ప్రపంచం నలుమూలల  నుంచి ప్రేమను పంచిన అభిమానులందరికీ థ్యాంక్స్‌. నేను బావున్నాను అని మీ అందరికీ తెలియజేయడానికే ఈ వీడియో మెసేజ్‌. ఎంత పాజిటీవ్‌గా చెప్పాలనుకున్నా ఐ యామ్‌ నాట్‌ గ్రేట్‌. బట్‌ గుడ్‌. గ్రేట్‌ అంటే అది వేరే లెవల్‌. ప్రస్తుతానికైతే ఐ యామ్‌ గుడ్‌. నాకు మంచి డాక్టర్స్, నర్సస్‌ ఉన్నారు. వాళ్ల బాగా కేర్‌ తీసుకున్నారు. థ్యాంక్యూ ఆల్‌’’ అని పేర్కొన్నారు ఆర్నాల్డ్‌. విశేషం ఏంటంటే సర్జరీ జరిగిన తర్వాత మేలుకొన్న వెంటనే ఆర్నాల్డ్‌ ‘ఐ యామ్‌ బ్యాక్‌’ అని అన్నారట.

Advertisement
 
Advertisement
Advertisement