అందుకే మగాళ్లు తరచు మోసాలకు పాల్పడుతుంటారు

Reasons For Cheating In Relationship - Sakshi

తరచు మోసాలకు పాల్పడే భాగస్వామి కారణంగా బంధమే కాదు మన ఆత్మ గౌరవం, ఇతర వ్యక్తుల మీద నమ్మకాన్ని కూడా కోల్పోతాం.  ఎదుటి వ్యక్తి మోసాల కారణంగా మనం తీవ్ర పరిణామాలను ఎదుర్కొవలసి వస్తుంది. భాగస్వామి మనస్తత్వాన్ని బట్టి వారు చిన్న విషయాలకు కూడా మనల్ని మోసం చేస్తుండొచ్చు. వారి ఆగడాలను పూర్తిగా అరికట్టడం అన్నది సాధ్యమమ్యేది కాదు! ముందు జాగ్రత్త పడటం తప్ప. ముఖ్యంగా బంధంలో ఆశించినంత సంతృప్తి లభించనప్పుడు మగవాళ్లు తరచూ మోసాలకు పాల్పడుతుంటారు. ఆడవాళ్లు కానీ, మగవాళ్లు కానీ, తమ చెడు చేష్టలకు తగిన కారణాలను జేబులో పెట్టుకుని తిరుగుతుంటారు. మోసాలకు కారణాలు అన్వేషించినపుడు ఈ క్రింది ఆరు ప్రధానమైనవిగా చెప్పుకోవచ్చు.

1)  భాగస్వామి సరిగా పట్టించుకోనపుడు వారి ఆలోచనలను తమ వైపు తిప్పుకోవటం కోసం. 
2) ప్రేమ మొదలైన కొత్తలో ఉన్నంత అందంగా, ఆకర్షణీయంగా భాగస్వామి లేకపోవటం.
3) ఇది వరకు ఒకరి చేతిలో మోసపోయిన కారణంగా ఆ కక్షతో ఇతరులను మోసం చేయాలనుకోవటం. 
4) ప్రేమ అనే బంధాన్ని ఎదుటి వ్యక్తి తేలిగ్గా తీసుకోవటం లేదా భాగస్వామి మీద ప్రేమ తగ్గిపోవటం. 
5) బంధంలోకి మూడో వ్యక్తి అడుగుపెట్టినపుడు.
6) మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉన్నపుడు.


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top