షాదీ. కామ్‌లో ఇక‌పై ఆ ఆప్ష‌న్ ఉండ‌దు

Matrimonial Website Shaadi.com Removes Skin Colour Filter - Sakshi

ప్ర‌ముఖ మ్యాట్రియమోనియ‌ల్ వెబ్‌సైట్ షాదీ. కామ్ త‌న వెబ్‌సైట్ నుంచి క‌ల‌ర్ ఫిల్ట‌ర్‌ను తొలిగించింది. స్కిన్‌టోన్ ఆధారంగా భాగ‌స్వామిని ఎంపిక చేసుకునే ఆప్ష‌న్‌పై ఆన్‌లైన్‌లో  పిటిష‌న్ దాఖ‌ల‌వ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకుంది. అయితే ఇది కావాల‌ని చేసింది కాద‌ని ఏదో  పొర‌పాటు జ‌రిగింద‌ని స‌దరు వెబ్‌సైట్ వివ‌ర‌ణ ఇచ్చింది. ప్ర‌పంచ వ్యాప్తంగా జాత్యాంహ‌కారంపై పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో షాదీ.కామ్ వెబ్‌సైట్‌పై   వివాదం  చ‌ర్చ‌నీయాంశ‌మైంది. దీని ప్ర‌కారం   భాగ‌స్వామిని ఎంపిక చేసుకునేముందు స‌ద‌రు వ్య‌క్తి వాళ్ల చ‌ర్మ‌రంగు ఏదో సెల‌క్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఫెయిర్, వైటీష్, డార్క్ వంటి ఆప్ష‌న్లుంటాయి. త‌ద్వారా  స్కిన్‌టోన్ ఆధారంగా వారికి త‌గ్గ జోడీలు ద‌ర్శ‌న‌మిస్తాయ‌న్న‌మాట‌. దీంతో ఈ అంశంపై వివాదం తలెత్తింది. దీనికి సంబంధించి ల‌ఖాని అనే మ‌హిళ ఆన్‌లైన్‌లో స‌ద‌రు వెబ్‌సైట్‌పై పిటిష‌న్ దాఖ‌లుచేసింది. ఇలాంటి చ‌ర్య‌లు ఆమోద‌యోగ్యం కాద‌ని రంగు ఆధారంగా భాగ‌స్వామిని ఎలా సెల‌క్ట్ చేస్తారంటూ మండిప‌డింది. అంతేకాకుండా ఈ ఫిల్ట‌ర్‌ను వెబ్‌సైట్ నుంచి  శాశ్వ‌తంగా తొలిగించాల‌ని డిమాండ్ చేసింది. ల‌ఖానీ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై దాదాపు 1600కి పైగానే ప్ర‌జ‌లు సంత‌కాలు చేసి త‌మ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. (మహిళ ఉద్యోగిపై దాడి.. కఠిన చర్యలు తీసుకోండి )

 

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top