యడ్డి, తనయుడిపై లోకాయుక్తలో కేసు

శివాజీనగర: బీజేపీ అగ్రనేత, మాజీ ముఖ్యమంత్రి బీ.ఎస్.యడియూరప్పకు ఎదురుదెబ్బ తగిలింది. యడ్డి, ఆయన తనయుడు, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడైన బీ.వై.విజయేంద్రలపై కేసు నమోదైంది. వివరాలు.. యడ్డి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బెంగళూరు అభివృద్ధి ప్రాధికార (బీడీఏ) పనుల కాంట్రాక్టు మంజూరులో భారీగా ముడుపులు తీసుకున్నారని టీజే అబ్రహాం అనే సామాజిక కార్యకర్త కోర్టులో ప్రైవేట్ కేసు వేయగా కోర్టు తిరస్కరించింది.
అబ్రహాం హైకోర్టులో సవాల్ చేయగా, ఆయన పిటిషన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఇటీవల ప్రజా ప్రతినిధుల కోర్టును ఆదేశించింది. ఈ నేపథ్యంలో లోకాయుక్త కేసు నమోదు చేసింది. ఈ ఆరోపణలు అన్నీ అవాస్తవాలనీ యడ్డి అన్నారు.
(చదవండి: IRTC Scam: తేజస్వీ యాదవ్ బెయిల్ రద్దు చేయండి)