లాక్‌డౌన్‌ వేళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే..

Familys Mental Health issues Rise Since lockdown - Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా సృష్టించిన విద్వంసం అందరికి తెలిసిందే. ఈ మహమ్మారి నుంచి రక్షించుకోవడానికి ప్రతి దేశం లాక్‌డైన్‌ను విధించాయి. ప్రస్తుత కష్టసమయంలో వివిధ వయస్సుల వారు ఎదుర్కొ‍ంటున్న మానసిక సమస్యలకు నిపుణులు అందిస్తున్న సూచనలు. 

లాక్‌డౌన్‌ కారణంగా ఎక్కువ ప్రభావితమయ్యే రంగం విద్యారంగమే అని నిపుణుల అభిప్రాయం. ముఖ్యంగా విద్యార్థులు తీవ్ర మనోవేదనను అనుభవిస్తున్నారు. విద్యాసంవత్సరం నష్టపోతుందని.. ఎంట్రన్స్‌ పరీక్షలకు ఎలా సన్నదం కావాలనే బెంగ విద్యార్థులకు కునుకు లేకుండా చేస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. విద్యార్థులు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని.. మన అధీనంలో లేని విషయాలను ఎక్కువగా ఆలోచించి ఒత్తిడికి గురికావొద్దని కేంద్ర ఆరోగ్య సంస్థ నిపుణుడు పంకజ్‌ గుప్తా పేర్కొన్నారు. తల్లిదండ్రులు, విద్యాసంస్థల నిపుణులు, సైకాలజీ కౌన్సిలర్లు నిరంతరం విద్యార్థులను పర్యవేక్షిస్తు కౌన్సెలంగ్‌ చేయాలని తెలిపారు. ఈ లాక్‌డౌన్‌ గండం నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ధ్యానం, యోగ, వ్యాయామాలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో చిన్నారులు స్మార్ట్‌ ఫోన్‌లకు పరిమితవ్వడంతో తాత, అవ్వలతో ఆడుకునే పరిస్థితి లేక వృద్ధులు తీవ్ర మనోవేదన చెందుతున్నారు. మరోవైపు వయస్సు రీత్యా వచ్చే జబ్బులతో నరకయాతన అనుభవిస్తున్నారు. ముఖ్యంలో మతిమరుపు, దీర్ఘకాలిక జబ్బులతో వృద్ధులు బాధపడుతున్నట్లు కొన్ని సర్వే సంస్థలు వెల్లడించాయి. ప్రభుత్వాలు వృద్ధుల సమస్యలను పరిష్కరించేవిధంగా ప్రత్యేక హెల్పలైన్‌ నెంబర్‌ రూపొందించాలని సైకాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు వర్క్‌ ఫ్రమ్‌ ఉద్యోగం చేసే మహిళలకు కుటుంబాన్ని సమన్వయపరుచుకుంటూ ఉద్యోగం చేయడం ఇబ్బందిగా మారిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top