విశాఖలో సబ్‌ మెరైన్‌ ఉత్సవాలు

విశాఖపట్నం: విశాఖపట్నంలోని ఐఎన్‌ఎస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో సబ్‌ మెరైన్‌ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 39 మంది అధికారులు, 621మంది నావికులు కూడా పాల్గొన్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పరేడ్‌ గ్రౌండ్‌కు విచ్చేసి పరేడ్‌ను తిలకించారు. గవర్నర​ నరసింహన్‌, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా  విచ్చేశారు. నౌకాదళంలోకి జలాంతర్గామి ప్రవేశించి 50 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. నౌకాదళంలో 1967 డిసెంబర్‌ 8న జలాంతర్గామి విభాగం ప్రారంభం కాగా తొలి జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ కల్వరి చేరింది.

Back to Top