స్వీపర్‌పై చెయ్యి చేసుకున్న ప్రిన్సిపాల్‌ | principal beat sweeper in government junior degree college | Sakshi
Sakshi News home page

స్వీపర్‌పై చెయ్యి చేసుకున్న ప్రిన్సిపాల్‌

Jan 6 2018 9:49 AM | Updated on Jan 6 2018 9:49 AM

principal beat sweeper in government junior degree college - Sakshi

బాధితురాలు చిన్న వెంకమ్మ

కర్నూలు : స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో స్వీపర్‌పై ప్రిన్సిపాల్‌ పీవీ హరిబాబు చేయి చేసుకున్నారు. ఈ మేరకు బాధితురాలు టు టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కళాశాలలో 1994 నుంచి స్వీపర్‌గా మాదం శెట్టి చిన్న వెంకమ్మ విధులు నిర్వహిస్తున్నారు. గురువారం రాత్రి కళాశాలలో వేసిన లైట్లు ఎందుకు ఆర్పలేదని ప్రిన్సిపాల్‌ చేయిచేసుకున్నట్లు ఆమె తెలిపారు. కళాశాల నుంచి వెళ్లిపోకపోతే ఉద్యోగం నుంచి తీసివేస్తానని బెదిరించినట్లు ఆమె వాపోయారు. అయితే వెంకమ్మ తమకు మౌఖికంగా ఫిర్యాదు చేశారని, లిఖిత పూర్వకంగా చేస్తే కేసు నమోదు చేస్తామని ఎస్‌ఐ ఓబులేసు తెలిపారు. ఇదిలా ఉండగా కేసు పెట్టకుండా కొందను వ్యక్తులు రాజీ కుదిర్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement