శిలాఫలకాలకి మూడున్నరేళ్లు!! | Three Years Back Chandra Babu Established Memorials In Nuziveedu IIIT | Sakshi
Sakshi News home page

శిలాఫలకాలకి మూడున్నరేళ్లు!!

Jun 15 2019 11:06 AM | Updated on Jun 15 2019 11:07 AM

Three Years Back Chandra Babu Established Memorials In Nuziveedu IIIT - Sakshi

చంద్రబాబు ఆవిష్కరించిన  శిలాఫలకాలు

సాక్షి, నూజివీడు:  రాజీవ్‌గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు ట్రిపుల్‌ఐటీలో శాఖా (డిపార్ట్‌మెంటల్‌) భవనాల నిర్మాణ పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయో అంతుబట్టడం లేదు.  2015 డిసెంబరు 23న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు  శంకుస్థాపన చేశారు. శం కుస్థాపన చేసి మూడున్నరేళ్లు గడిచినా ఇంత వరకు భవనాల పనులే ప్రారంభంకాని దారుణ పరిస్థితి ఇది.   ఆర్జీయూకేటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన చంద్రబాబు భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది.భవన నిర్మాణ పనులు ప్రారంభం కాకపోవడంతో  శంకుస్థాపన శిలాఫలకాలు వచ్చే పోయే వారికి స్వాగతం పలుకుతున్నట్లుగా ప్రధాన గేటు పక్కన  దర్శనమిస్తున్నాయి.

డిపార్ట్‌మెంట్‌ల వారీగా వసతులను కల్పించాల్సిన అవసరం ఉన్నందున డిపార్ట్‌మెంట్‌ భవనానికి శ్రీకారం చుట్టడం మంచిదే కాని, జాప్యం జరగడంపైనే పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రూ.60 కోట్ల అం చనాలతో నిర్మించాల్సి ఉన్న ఈ భవనం మొత్తం 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ప్రస్తుతం ట్రిపుల్‌ఐటీలో ఒక్క మెకానికల్‌ బ్రాం చికి మాత్రమే పూర్తిస్థాయిలో ల్యాబ్‌ సదుపాయం ఉంది. మిగిలిన ఐదు బ్రాంచిలకు సంబంధించి పూర్తిస్థాయిలో ల్యాబ్‌ల సదుపాయం లేదు. అలాగే హెచ్‌వోడీలకు సరైన సదుపాయాలు, సౌకర్యాలు లేవు. ఉన్న వాటిల్లోనే ప్రస్తు తం సర్దుకుంటున్నారు. ఎంతో ముఖ్య మైన ఇలాంటి భవన నిర్మాణంలో ఎందుకు జాప్యం జరుగుతుందో అంతుబట్టడం లేదు. 


నూజివీడు  ట్రిపుల్‌ఐటీ

పది డిపార్ట్‌మెంట్‌లకు కలిపి ఒకే భవనం 
ట్రిపుల్‌ఐటీలను స్థాపించి 10ఏళ్లు గడిచినా విద్యార్థులకు తరగతి గదులు, హాస్టల్, మెస్, గ్రంథాలయం తదితర  వసతులు మాత్రమే పూర్తిస్థాయిలో అం దుబాటులోకి రాగా, సబ్జెక్టుల వారీగా అవసరమైన వసతులు బోధనా సిబ్బం దికి అందుబాటులోకి రాలేదు. దీంతో పీయూసీకి సంబంధించి గణితం, భౌతి కశాస్త్రం, రసాయనశాస్త్రం, ఇంగ్లీషుతో పాటు ఇంజినీరింగ్‌కు సంబంధించి మెకానికల్, సివిల్, సీఎస్‌ఈ, ఈసీఈ, కెమికల్, మెటలర్జీ బ్రాంచిలకు సం బం ధించి డిపార్ట్‌మెంటుల వారీగా వసతులు లేవు.

దీంతో హెచ్‌వోడీలు అకడమిక్‌ భవనాలలో, పరిపాలన భవనంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక వసతులతో సర్దుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పది శాఖలకు సంబంధించి వసతులుండటంతో పాటు హెచ్‌వోడీలకు, స్టాఫ్‌కు, విద్యార్థులతో, స్టాఫ్‌ తో సమావేశాలు పెట్టుకోవడానికి అవసరమైన గదులు ఇలా అన్ని రకాల వసతులు ఉండేలా నిర్మించాల్సి ఉంది. దీంతో అప్పట్లో ముఖ్యమంత్రిచే శంకుస్థాపన చేయిం చారు. ఇప్పటివరకు పనులు ప్రారంభం కాకపోవడంతో నాపరాళ్లపై పేర్లు వేసుకోవడానికి శంకుస్థాపన చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement