క్లిక్‌ కొట్టు..సరుకులు పట్టు | online easy shopping | Sakshi
Sakshi News home page

క్లిక్‌ కొట్టు..సరుకులు పట్టు

Feb 6 2018 7:52 PM | Updated on Feb 6 2018 7:52 PM

online easy shopping - Sakshi

వైరా : ఆధునిక కాలం..అందుబాటులో టెక్నాలజీ..ఇంటర్నెట్‌ సౌకర్యంతో ఆన్‌లైన్‌ షాపింగ్‌ క్రమంగా విస్తరిస్తోంది. గతంలో నగరాలు, పట్టణాల నుంచే ఆన్‌లైన్‌లో వివిధ రకాల వస్తువులను ఆర్డర్‌ చేయగా..ఇటీవల కాలంలో గ్రామాలనుంచి కూడా బుకింగ్‌లు పెరుగుతున్నాయి. పలు కంపెనీలు ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ల ద్వారా తీరొక్క వస్తువులను విక్రయిస్తుండగా..కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్ల ద్వారా కావాల్సినవాటిని కొనుగోలు చేస్తున్నారు. చిరునామా, ఫోన్‌ నంబర్‌ను యాప్‌ ద్వారా నమోదు చేసుకుంటే..రెండు, మూడు రోజుల్లో ఆ వస్తువు ఇంటికి చేరుతుంది. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ల హవా కొనసాగుతుండటంతో అరచేతిలోనే షాపింగ్‌ జరుగుతోంది. దీనిపై అన్ని వర్గాల ప్రజలు ఆసక్తి కనబరుస్తుండటంతో ఆన్‌లైన్‌ షాపింగ్‌కు ఆదరణ అంతకంతకూ పెరుగుతోంది. ప్రతి మండల కేంద్రంలో డెలవరీ కేంద్రాలను ఏర్పాటు చేసి ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న వినియోగదారులకు వస్తువులను చేరవేస్తున్నారు.  

తీరొక్క వస్తువులు..  
ఆన్‌లైన్‌ షాపింగ్‌లో ఎలక్ట్రికల్, పురుషులు, మహిళలకు సంబంధించిన దుస్తులు, ఎలక్ట్రానిక్స్, సెల్‌ఫోన్లు, ఇతరత్రా సామగ్రి, షూస్, చెప్పులు, గృహోపకరణాలు, గ్రంథాలు..ఇలా అన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్లలో నచ్చిన షాపింగ్‌ అప్లికేషన్లను డౌన్‌లోడ్‌ చేసుకునే వీలుంది. ఆప్లికేషన్‌ ద్వారా ఆన్‌లైన్‌లో నచ్చిన వస్తువులను ఎంచుకోవాలి. ఆ తర్వాత ఒక ఫాం వస్తుంది. అందులో పూర్తి చిరునామా, సెల్‌నంబర్, మెయిల్‌ ఐడీ ఫిల్‌ చేసి సెండ్‌ చేయాలి. వినియోగదారులు డబ్బులు చెల్లించేందుకు నాలుగు పద్ధతులున్నాయి. క్యాష్‌ ఆన్‌ డెలివరీ, డెబిట్, క్రెడిట్, నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా నగదు చెల్లించవచ్చు. నచ్చిన వాటిని ఎంపిక చేసుకుని దాని ప్రకారం చెల్లిస్తే సరిపోతుంది. క్యాష్‌ ఆన్‌ డెలివరీ అయితే ఎంపిక చేసుకున్న వస్తువు ఇంటికి చేరిన తర్వాత కొరియర్‌ బాయ్‌కి క్యాష్‌ చెల్లించాల్సి ఉంటుంది.


నచ్చకపోతే వెనక్కి..
ఆన్‌లైన్‌ షాపింగ్‌ ద్వారా కొనుగోలు చేసిన వస్తువు నచ్చకపోతే తిరిగి 15రోజుల్లోపు వెనక్కి పంపించవచ్చు. మొదట ఆన్‌లైన్‌లో కస్టమర్‌కేర్‌కు కాల్‌చేస్తే వారు పూర్తి వివరాలు వెల్లడిస్తారు. ఆ డబ్బులను తిరిగి వినియోగదారుడికి బ్యాంక్‌ అకౌంట్‌లో జమ చేస్తారు. ఆన్‌లైన్‌ షాపింగ్‌లో కొన్ని కంపెనీలు రోజుకో ఆఫర్లు ప్రకటిస్తూ ఆకర్షిçస్తున్నాయి.

జర భద్రం..

కొన్ని నకిలీసైట్లు ఆకర్షిస్తుంటాయి

వాటిలో నమోదు చేసుకోవద్దు

తయారీ సంస్థ నుంచి నేరుగా బిల్లులు లేకపోవడం లోపం

సర్వీస్‌ సెంటర్లు అందుబాటులో ఉండవు

ముఖాముఖి లావాదేవీలు లేక గ్యారంటీ కరువు

వారంటీ విషయంలో స్పష్టత లేదు

ముందస్తు చెల్లింపుల తర్వాత తీవ్రజాప్యం

కొన్ని సందర్భాల్లో అసలు వస్తువులే రావట్లే

పేరెన్నిక గల కంపెనీల వస్తువులు కొనడం ఉత్తమం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement