breaking news
Easy Buy stores
-
క్లిక్ కొట్టు..సరుకులు పట్టు
వైరా : ఆధునిక కాలం..అందుబాటులో టెక్నాలజీ..ఇంటర్నెట్ సౌకర్యంతో ఆన్లైన్ షాపింగ్ క్రమంగా విస్తరిస్తోంది. గతంలో నగరాలు, పట్టణాల నుంచే ఆన్లైన్లో వివిధ రకాల వస్తువులను ఆర్డర్ చేయగా..ఇటీవల కాలంలో గ్రామాలనుంచి కూడా బుకింగ్‌లు పెరుగుతున్నాయి. పలు కంపెనీలు ఆన్లైన్ వెబ్సైట్ల ద్వారా తీరొక్క వస్తువులను విక్రయిస్తుండగా..కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్ల ద్వారా కావాల్సినవాటిని కొనుగోలు చేస్తున్నారు. చిరునామా, ఫోన్ నంబర్‌ను యాప్ ద్వారా నమోదు చేసుకుంటే..రెండు, మూడు రోజుల్లో ఆ వస్తువు ఇంటికి చేరుతుంది. ప్రస్తుతం స్మార్ట్ఫోన్ల హవా కొనసాగుతుండటంతో అరచేతిలోనే షాపింగ్ జరుగుతోంది. దీనిపై అన్ని వర్గాల ప్రజలు ఆసక్తి కనబరుస్తుండటంతో ఆన్లైన్ షాపింగ్‌కు ఆదరణ అంతకంతకూ పెరుగుతోంది. ప్రతి మండల కేంద్రంలో డెలవరీ కేంద్రాలను ఏర్పాటు చేసి ఆన్లైన్లో బుక్ చేసుకున్న వినియోగదారులకు వస్తువులను చేరవేస్తున్నారు. తీరొక్క వస్తువులు.. ఆన్లైన్ షాపింగ్‌లో ఎలక్ట్రికల్, పురుషులు, మహిళలకు సంబంధించిన దుస్తులు, ఎలక్ట్రానిక్స్, సెల్ఫోన్లు, ఇతరత్రా సామగ్రి, షూస్, చెప్పులు, గృహోపకరణాలు, గ్రంథాలు..ఇలా అన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు స్మార్ట్ఫోన్లలో నచ్చిన షాపింగ్ అప్లికేషన్లను డౌన్లోడ్ చేసుకునే వీలుంది. ఆప్లికేషన్ ద్వారా ఆన్లైన్లో నచ్చిన వస్తువులను ఎంచుకోవాలి. ఆ తర్వాత ఒక ఫాం వస్తుంది. అందులో పూర్తి చిరునామా, సెల్‌నంబర్, మెయిల్ ఐడీ ఫిల్ చేసి సెండ్ చేయాలి. వినియోగదారులు డబ్బులు చెల్లించేందుకు నాలుగు పద్ధతులున్నాయి. క్యాష్ ఆన్ డెలివరీ, డెబిట్, క్రెడిట్, నెట్ బ్యాంకింగ్ ద్వారా నగదు చెల్లించవచ్చు. నచ్చిన వాటిని ఎంపిక చేసుకుని దాని ప్రకారం చెల్లిస్తే సరిపోతుంది. క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఎంపిక చేసుకున్న వస్తువు ఇంటికి చేరిన తర్వాత కొరియర్ బాయ్‌కి క్యాష్ చెల్లించాల్సి ఉంటుంది. నచ్చకపోతే వెనక్కి.. ఆన్లైన్ షాపింగ్ ద్వారా కొనుగోలు చేసిన వస్తువు నచ్చకపోతే తిరిగి 15రోజుల్లోపు వెనక్కి పంపించవచ్చు. మొదట ఆన్లైన్లో కస్టమర్‌కేర్‌కు కాల్చేస్తే వారు పూర్తి వివరాలు వెల్లడిస్తారు. ఆ డబ్బులను తిరిగి వినియోగదారుడికి బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు. ఆన్లైన్ షాపింగ్‌లో కొన్ని కంపెనీలు రోజుకో ఆఫర్లు ప్రకటిస్తూ ఆకర్షిçస్తున్నాయి. జర భద్రం.. కొన్ని నకిలీసైట్లు ఆకర్షిస్తుంటాయి వాటిలో నమోదు చేసుకోవద్దు తయారీ సంస్థ నుంచి నేరుగా బిల్లులు లేకపోవడం లోపం సర్వీస్ సెంటర్లు అందుబాటులో ఉండవు ముఖాముఖి లావాదేవీలు లేక గ్యారంటీ కరువు వారంటీ విషయంలో స్పష్టత లేదు ముందస్తు చెల్లింపుల తర్వాత తీవ్రజాప్యం కొన్ని సందర్భాల్లో అసలు వస్తువులే రావట్లే పేరెన్నిక గల కంపెనీల వస్తువులు కొనడం ఉత్తమం -
చిన్న నగరాల్లో ఈజీబై స్టోర్లు
•రెండేళ్లలో మొత్తం 50 కేంద్రాలు •కంపెనీ బిజినెస్ హెడ్ ఆనంద్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రెడీమేడ్ దుస్తుల రంగంలో ఉన్న ఈజీబై రెండేళ్లలో స్టోర్ల సంఖ్యను 50కి చేర్చనుంది. ల్యాండ్‌మార్క్ గ్రూప్‌నకు చెందిన ఈ కంపెనీకి ప్రస్తుతం 15 ఔట్లెట్లు ఉన్నాయి. కొత్త దుకాణాలన్నీ దక్షిణాది రాష్ట్రాల్లోనే వస్తాయని ఈజీబై బిజినెస్ హెడ్ ఆనంద్ అయ్యర్ తెలిపారు. ఒక్కో రాష్ట్రంలో విస్తరించిన తర్వాతే మరో రాష్ట్రంలో అడుగుపెడుతున్నట్టు వెల్లడించారు. ఫ్రాంచైజీ అయిన వి-రిటైల్ తెలంగాణలో అతిపెద్ద ఈజీబై స్టోర్‌ను హైదరాబాద్‌లోని కేపీహెచ్బీలో ప్రారంభించిన సందర్భంగా బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లా కేంద్రంలో ఒక దుకాణాన్ని తెరుస్తామని చెప్పారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఫ్రాంచైజీ విధానంలోనే వీటిని నెలకొల్పుతామన్నారు. ‘ఒక్కో స్టోర్‌కు రూ.1 కోటి దాకా వ్యయం అవుతుంది. సరుకు నిర్వహణ పూర్తిగా కంపెనీయే చూసుకుంటుంది. థర్డ్ పార్టీ ప్లాంట్ల నుంచి నాణ్యమైన దుస్తులను కొనుగోలు చేస్తున్నాం’ అని వివరించారు. ప్రస్తుతం అయిదు స్టోర్లు నిర్వహిస్తున్నామని, డిసెంబరుకల్లా మరో మూడు స్టోర్లు ప్రారంభిస్తామని వి-రిటైల్ డెరైక్టర్ మధుసూధన్ తెలిపారు. దుస్తుల ధర రూ.69-699 మధ్య ఉంది.