గ్రాసం కోసం పశువుల విలవిల

Livestock For Animals - Sakshi

సాక్షి, ఇల్లందకుంట: వేసవి ముదిరే కొద్దీ కరువు మేఘాలు కమ్ముకొస్తున్నాయి. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పశుగ్రాసం కొరత ఏర్పడింది. వర్షాభావంతో ఖరీఫ్‌లో పంటలు పండక గ్రాసానికి అవస్థలు తప్పడం లేదు. మూగజీవాలకు మేతకోసం ఇతర ప్రాంతాలకు ప్రతిరోజు వాహనాలపై కాపరులు తరలిస్తున్నారు. ప్రభుత్వం ఉపాధిహామీ పథకం ద్వారా పశువుల మేత పెంపకానికి కార్యక్రమాలు చేస్తున్న  క్షేత్రస్థాయిలో రైతులకు అందడం లేదు. పశు సంవర్ధక శాఖ పంపిణీ చేస్తున్న పశుగ్రాసం, విత్తనాపంపిణీ మొక్కుబడిగా మారింది. ఫలితంగా పశువులను రైతులు సంతలో విక్రయిస్తున్నారు. ఉపాధి, వాటర్‌షెడ్‌ పథకాల్లో భాగంగా పశుగ్రాసాన్ని పెంచేందుకు ముందుకు వచ్చిన రైతులకు సంబంధిత శాఖ సిబ్బంది నుంచి ప్రోత్సాహం కరువైంది. కొంతమంది రైతులే ఈ ప్రయోజనాన్ని పొందుతున్నారు.

ముందస్తు సమాచారం లేక ఉచిత విత్తనాలు ఇతర రైతులకు అందలేదు. ఉపాధిహామీ పథకంలో పశుగ్రాసం పెంపకానికి చేపట్టిన కార్యక్రమం నివేదికలకే పరిమితమైంది. సమాచార లోపంతో రైతులకు ఉచిత విత్తనాలు కరువయ్యాయి. ఇప్పటికే మండలవ్యాప్తంగా పశుసందప తగ్గుముఖం పడుతోంది. ఇటు పశుగ్రాసం కొరత అన్నదాతను కలవరపెడుతోంది. ఎడ్లబండిలోడ్‌ వరి గ్రాసానికి రూ.వెయ్యికి పైగా, ట్రాక్టర్‌ వరి గ్రాసాన్ని రూ.6వేల వరకు కొనుగోలు చేస్తున్నారు. మండలంలో పశు సంపదను కాపాడుకునేందుకు రైతులు కష్టాలు పడుతున్నారు. పశువులను పోషిస్తున్న రైతులు గ్రాసం కోసం అధిక ధరలు వెచ్చించి పశు సంపదను కాపాడుకుంటున్నారు.  

మొక్కుబడిగా విత్తనాల పంపిణీ  
ప్రభుత్వ పరంగా పశు సంవర్ధక, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో పంపిణీ చేసే గ్రాసం విత్త నాలు మొక్కుబడిగా అందిస్తున్నారు. అవి కూ డా పలుకుబడి ఉన్నవారికి ఇస్తున్నారు. విత్తనాల సరఫరా చేస్తున్న ట్లు ఎలాంటి సమాచారం ఇవ్వరూ. తీరా విషయం తెలుసుకొని వెళ్లే సరికి విత్తనాలు ఉండడం లేదు.   


- అంబటి రమేశ్, రైతు  
 

తక్కువకు అమ్ముతున్నం  
వేసవికాలం కరువు పరిస్థితులతో తక్కువ ధరలకు పశువులను విక్రయిస్తున్నాం. వేలకు వేలు డబ్బులు ఖర్చులు పెట్టినా గ్రాసం మార్కెట్లో దొరకడం లేదు. ప్రభుత్వం కల్పిస్తున్నా రాయితీలు అందడం లేదు  చివరికీ పశుసంపద అంతరించి పోయే ప్రమాదం కనిపిస్తుంది. ఏంచేయాలో అర్థం కావడం లేదు.  

         
– చెన్నారెడ్డి, రైతు 
 

తిప్పలు పడుతున్నాం 
మూగజీవాలకు పశుగ్రాసం అందించేందుకు నా నా ఇబ్బందులు పడుతున్నాం. ఇతర ప్రాంతాల కు వేలాది రూపాయల డబ్బులు పెట్టి దిగుమతి చేసుకోవాల్సివస్తుంది. దీంతోఆర్థికంగా ఇబ్బందులుపడుతున్నాం. మా సమస్యపై అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలి.  


– దార సదయ్య ,  రైతు 

Read latest Karimnagar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top