నిలువెత్తు బంగారాన్ని సమర్పించిన స్పీకర్

speaker madhusudhana chary visits medaram - Sakshi

సాక్షి, భూపాలపల్లి: శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి శనివారం మేడారం సమ్మక్క-సారాలమ్మలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నిలువెత్తు బంగారాన్ని సమర్పించి అమ్మవార్లకు మొక్కులు చెల్లించారు. దర్శన అనంతరం ఆయన మాట్లాడుతూ జాతర ఇంకా ప్రారంభం కాకముందే ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు దర్శనం చేసుకుంటున్నారన్నారు. రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో తగిన ఏర్పాట్లను చేస్తున్నట్టు తెలిపారు.

కుంభమేళాలు నదీ పరివాహక ప్రాంతాల్లో జరిగితే.. తెలంగాణలో అటవీ ప్రాంతాన కుంభమేళా జరగడం విశేషమన్నారు. ప్రపంచంలో అరుదైన జాతర మేడారమని అభివర్ణించారు. తెలంగాణ ప్రజల జీవితాలు ప్రకృతితో ముడిపడి ఉన్నాయన్నారు. కుటుంబ సమేతంగా ఈ నెల 31న ఎడ్ల బండి పై మరోసారి వచ్చి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటానని మధుసూదనాచారి తెలిపారు.

సంబంధిత వార్తలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top