యూఎఫ్‌వోనా? సూర్యుడి ఎఫెక్టా!? | Yuephvona? The effects of the sun ? | Sakshi
Sakshi News home page

యూఎఫ్‌వోనా? సూర్యుడి ఎఫెక్టా!?

Jun 3 2015 12:54 AM | Updated on Sep 3 2017 3:07 AM

యూఎఫ్‌వోనా? సూర్యుడి ఎఫెక్టా!?

యూఎఫ్‌వోనా? సూర్యుడి ఎఫెక్టా!?

గ్రహాంతరవాసుల వ్యోమనౌక నేలకు దిగుతున్నట్లున్న ఈ దృశ్యం హాలెండ్‌లోని గ్రోనింజెన్‌లో కనిపించింది.

గ్రహాంతరవాసుల వ్యోమనౌక  నేలకు దిగుతున్నట్లున్న ఈ దృశ్యం హాలెండ్‌లోని గ్రోనింజెన్‌లో కనిపించింది. హ్యారీ పెర్టన్ అనే బ్లాగర్ తన ఇంటి నుంచి ఇటీవల తుపాను వాతావరణాన్ని ఫొటోలు తీస్తుండగా ఆకాశంలో మెరుపు మెరిసింది. ఫొటోలు వచ్చాక చూస్తే ఇలా.. ఓ యూఎఫ్‌వో(గుర్తు తెలియని ఎగిరే పళ్లెం) నేలకు దిగుతున్నట్లుగా కనిపించింది.

ఇది యూఎఫ్‌వోనే కావొచ్చని కొందరు.. వాతావరణం మారిపోవడంతో ఇలా కనిపించి ఉంటుందని మరికొందరు అంటున్నారు. తుపాను మేఘాల్లోకి సూర్యకిరణాలు చొచ్చుకొచ్చి ఇలా రంగుల కాంతి విరజిమ్మి ఉంటుందని శాస్త్రవ్తేలు చెబుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement