ఈ ఇంటికి ఇంజనీరు యూట్యూబ్‌...! | YouTube engineer for this house! | Sakshi
Sakshi News home page

ఈ ఇంటికి ఇంజనీరు యూట్యూబ్‌...!

Jan 22 2017 3:03 AM | Updated on Sep 5 2017 1:46 AM

ఈ ఇంటికి ఇంజనీరు యూట్యూబ్‌...!

ఈ ఇంటికి ఇంజనీరు యూట్యూబ్‌...!

సాధారణంగా ఇంటర్‌నెట్‌æను అనుసరించేవారు చాలా మంది యూట్యూబ్‌ వీడియోలు చూసి వంటలు నేర్చుకుంటుంటారు.

సాధారణంగా ఇంటర్‌నెట్‌ను అనుసరించేవారు చాలా మంది యూట్యూబ్‌ వీడియోలు చూసి వంటలు నేర్చుకుంటుంటారు.  వ్యాయామాలు, డ్యాన్సులు చేస్తుం టారు. ఆఖరికి ఆన్ లైన్  తరగతుల ద్వారా చదువుకుంటుంటారు కూడా. కానీ మీలో ఎవరైన ‘ఇల్లు ఎలా కట్టాలి’ అని యూట్యూబ్‌లో వీడియోలు చూసి ఇంటిని నిర్మించడం గురించి విన్నారా? కానీ అదీ సాధ్యమే. మేము అలానే ఓ ఇల్లు కట్టుకున్నాం అంటోంది ఓ కుటుంబం. ఇంటి నిర్మాణంలో ఎలాంటి అనుభవం లేని ఆ సాదాసీదా కుటుంబం ఐదు బెడ్‌ రూమ్‌లతో కూడిన రెండం తస్తుల మేడను నిర్మించుకుని ఔరా అనిపించింది.

ఇందులో మరొ వింత ఉంది. ఆ ఇంటిని ఒక తల్లి ఆమె నలుగురి పిల్లల సాయంతోనే కట్టేసింది. అర్కాన్ సాస్‌లోని కారా బ్రూకిన్స్  అనే మహిళ తన భర్తనుంచి తెగదెంపులు చేసుకుని పిల్లలతో జీవిస్తోంది. ఆమెకు నలుగురు పిల్లలు (వారి వయసులు 7,15, 11, 2). ఉదయమంతా తన ఉద్యోగ ధర్మాన్ని ముగించుకుని సాయంకాలం వేళ యూట్యూబ్‌లో ఇల్లు నిర్మించు కోవడం ఎలా అనే వీడియోలు వీక్షించేది. అలా తెలుసుకున్న పరిజ్ఞానం ద్వారా ఇంటి నిర్మాణానికి అవసమైన వస్తువులను తన దగ్గరు న్న కొద్దిపాటి సొమ్ముతో  సమకూర్చుకుంది.

ఆ తర్వాత ఇల్లు నిర్మించడం ప్రారంభించింది. మెల్లమెల్లగా తన పిల్లలు కూడా  కారాకి సహాయపడుతూ వచ్చారు.  ఇంటి నిర్మాణంలో ఉండగా ప్రతి దశకు సంబంధించి  మూడు నాలుగు వీడియోలు చూసి పరిజ్ఞానాన్ని పెంచుకునేది. ఆ వీడియోల్లో నుంచి  ఏది ఉత్తమమైన, సులభమైన పద్ధతి అనే ఒక అంచనాకు వచ్చి దాన్ని అనుసరించేది. ఇలా ఏకంగా 9 నెలల్లోనే సుందరమైన తన కలల సౌధాన్ని పూర్తి చేసింది. తన ఇంటికి ఇంజనీరు యూట్యూబే అంటోంది కారా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement