‘వందేళ్లకు పైగా డాక్టర్‌ను చూడని బామ్మ’

Worlds Oldest Person Dies In Russia - Sakshi

మాస్కో : ప్రపంచంలోనే అత్యధిక వయస్సు కలిగిన వ్యక్తిగా భావిస్తున్న రష్యా మహిళ టాంజిలియా బిసెంబెయేవా 123 సంవత్సరాల వయసులో దక్షిణ రష్యాలోని తన స్వగ్రామంలో తుదిశ్వాస విడిచారు. బిసెంబెయేవా మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఖననం చేశారని డైలీ మెయిల్‌ పేర్కొంది. ఆమె ప్రశాంతంగా కన్నుమూశారని, కుటుంబ మెమోరియల్‌లో ఆమెను ఖననం చేశారని అధికారులు తెలిపారు. ఆమె అంతిమయాత్రను వీక్షించేందుకు గ్రామం మొత్తం తరలివచ్చిందని చెప్పారు. టాంజిలియా బిసెంబెయేవా 1896 మార్చి 14న జన్మించినట్టు చెబుతున్నారు. ఆమెకు నలుగురు పిల్లలు కాగా, పది మంది మనుమలు, 13 మంది మునిమనుమలు, మరో ఇద్దరు మునిమనుమల కుమారులున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె ఎప్పుడూ కుదురగా కూర్చోదని, ఎప్పుడూ ఏదో ఒక పనిచేస్తూనే ఉంటారని అదే ఆమె దీర్ఘాయుష్షుకు కారణమని చెప్పుకొచ్చారు. ఆమె పులియబెట్టిన పాలు ఎక్కువగా తీసుకునేవారని వెల్లడించారు. ఆమె తొలిసారిగా వైద్యుడ్ని సంప్రదించినప్పుడే ఆమెకు వందేళ్లు పైబడ్డాయని స్ధానికులు చెప్పారు. కాగా, 2016లో  టాంజిలియా బిసెంబెయేవా 120 సంవత్సరాల వయసుతో ప్రపంచంలోనే జీవిస్తున్న అతిపెద్ద వయస్కురాలిగా అధికారికంగా గుర్తించినట్టు రష్యన్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ పేర్కొంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top