అద్భుతాన్ని వెలుగులోకి తెచ్చారు

World's Largest Underwater Cave Discovered - Sakshi

మెక్సికో : పురాతత్వ శాస్త్రవేత్తలు అద్భుతమైన విషయాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ప్రపంచంలో నీటితో నిండిన అతిపెద్ద గుహను మెక్సికోలో కనుగొన్నారు. తద్వారా నీటి అడుగున మిగిలిపోయిన ప్రాచీన చరిత్రను అధ్యయనం చేసే అవకాశం లభించినట్లయ్యింది.

యుకటన్‌ ద్వీపకల్పంలో మిస్టరీగా మారిన ఈ అంశంపై 20 ఏళ్లుగా రాబర్ట్‌ స్కిమిట్నర్‌ పరిశోధనలు చేస్తూనే ఉన్నాడు. చివరకు గామ్‌ బృందం(పురాతత్వ పరిశోధన సంస్థ) సహకారంతో.. కొందరు స్కూబా డైవర్లను లోపలికి పంపి ఆయన ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. వరదలతో నిండిపోయిన ఈ పురాతన గుహలు 347 కిలోమీటర్ల మేర ఇది విస్తరించి ఉండటం పరిశోధకులను ఆశ్చర్యపరిచింది. డోస్‌ ఓజోస్‌ గుహలే ఇప్పటిదాకా పెద్దవిగా(83 కిలో మీటర్ల మేర విస్తరించి) గుర్తింపు పొందాయి. అయితే వాటికన్నా సాక్‌ అక్టన్‌ పద్ధతిలో ఏర్పడిన ఈ గుహలు వందల రేట్లు ఎక్కువగా విస్తరించి ఉండటం విశేషం. 

10 నెలల నిరంతరాయ పరిశోధన తర్వాత వేల సంవత్సరాల నాటి శిలాజాలు లభించగా.. వాటిని చరిత్రకారులు పరిశీలిస్తున్నారు. మయాన్‌ చరిత్రను, సంప్రదాయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి ఈ గుహలు ఉపకరిస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మొత్తం 1500 కిలో మీటర్ల మేర ఇది విస్తరించి ఉండొచ్చని పురాతత్వ శాస్త్రవేత్తలు ఓ అంచనా వేస్తున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top