మహిళా జర్నలిస్టు కాల్చివేత | Woman journalist shot dead in Somalia | Sakshi
Sakshi News home page

మహిళా జర్నలిస్టు కాల్చివేత

Jun 6 2016 5:32 PM | Updated on Sep 4 2017 1:50 AM

మహిళా జర్నలిస్టు కాల్చివేత

మహిళా జర్నలిస్టు కాల్చివేత

సొమాలియా రాజధాని మొగదీషులో మహిళా జర్నలిస్టు హత్యకు గురయ్యారు.

మొగదీషు: సొమాలియా రాజధాని మొగదీషులో మహిళా జర్నలిస్టు హత్యకు గురయ్యారు. ప్రభుత్వ రేడియాలో ప్రొడ్యుసర్ గా పనిచేస్తున్న సాగల్ సలాద్ ఒస్మాన్ ను ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. యూనివర్సిటీ వెలుపల వేచివున్న ఆమె సాయుధ దుండగులు కాల్పులు జరిపారని జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది.

మహిళా జర్నలిస్టు హత్యను సొమాలియా అధ్యక్షుడు హసన్ షేక్ మహ్మద్, సోమాలి ఇండిపెండెంట్ మీడియా హౌసెస్ అసోసియేషన్(సిమ్హా) ఖండించింది. హంతకులను పట్టుకుని చట్టపరంగా శిక్షించాలని సిమ్హా డిమాండ్ చేసింది. గత ఆరు నెలల్లో మహిళా జర్నలిస్టు హత్యకు గురికావడం ఇది రెండోసారి.

Advertisement
 
Advertisement
Advertisement