బాల్‌ను ఓ రేంజ్‌లో ఆడేసుకుందిగా.. | Woman Amazing Freestyle Football Skills In Heels Went Viral | Sakshi
Sakshi News home page

ఫుట్‌బాల్‌ను ర‌ఫ్ఫాడించింది, అదీ హీల్స్‌తో!

May 15 2020 7:45 PM | Updated on May 15 2020 8:09 PM

Woman Amazing Freestyle Football Skills In Heels Went Viral - Sakshi

ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ ఫుట్‌బాల్ దిగ్గ‌జాలు అన‌గానే ట‌క్కున గుర్తొచ్చే పేర్లు క్రిస్టియానో రొనాల్డో, లియోన‌ల్ మెస్సీ. వీరు మైదానంలో అడుగుపెడితే ప్రేక్ష‌కుల ఈలలు, కేరింత‌లు, చ‌ప్ప‌ట్లకు కొద‌వే లేదు. అయితే వీరిని సైతం ఆశ్చ‌ర్య‌ప‌రిచేలా ఓ యువ‌తి ఫుట్‌బాల్‌ను ర‌ఫ్ఫాడిస్తోంది. అది కూడా స‌న్న‌ని హీల్స్ ధ‌రించి! ర‌క్వెల్‌ బెన‌ట్టీ అనే యువ‌తి మైదానంలో అడుగుపెట్ట‌కపోయినా కావాల్సినంత క్రేజ్ తెచ్చేసుకుంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన‌ ఒక్క వీడియోతో స్టార్ అయిపోయింది. (అతను ఆడలేదుగా.. డబ్బులు ఇచ్చేయండి!)

ఇందులో ఆమె ఫుట్‌బాల్‌ను కాలితో క్యాచ్‌లు, నెత్తిన పెట్టుకుని డ్యాన్సులు, హీల్స్‌తో కిక్కులు, పుష‌ప్స్‌లు, ప‌డుకుని బాల్‌ను ప‌ల్టీలు కొట్టించ‌డాలు.. ఇలా ఒక‌టేమిటీ.. ఎన్నో చేసింది. 50 సెకండ్ల‌లో ఒక్క‌సారి కూడా బాల్‌ను కింద‌ప‌డ‌ని‌వ్వ‌కుండా విన్యాసాలు చేస్తూ అబ్బుర‌ప‌రిచింది. ఇది పాత వీడియోనే అయిన‌ప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో మ‌రోసారి ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. ఆమె టాలెంట్‌కు మంత్ర‌ముగ్ధుడైన ఓ నెటిజ‌న్ "రొనాల్డో, మెస్సీ.. ఈ భూమ్మీద ఉన్న ఏ ఒక్క‌రూ హీల్స్ ధ‌రించి ఇలా ఆడ‌లేరు" అని ప్ర‌శంసించాడు. మ‌రో వ్య‌క్తి ఈ వీడియోను తిరిగి ట్విట‌ర్‌లో పోస్ట్ చేస్తూ.. "క్రిస్టియానో రొనాల్డో, లియోన‌ల్ మెస్సీ.. 24 గంట‌ల్లోగా దీనిపై స్పందించాల‌"ని క్యాప్ష‌న్ జోడించాడు. చూడాలి మ‌రి, ఫుట్‌బాల్ దిగ్గ‌జాలు స్పందిస్తాయో లేదో! (రొనాల్డోను దాటేసిన మెస్సీ..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement