అతను ఆడలేదుగా.. డబ్బులు ఇచ్చేయండి!

Court Awards Fans Compensation For Friendly Ronaldo Sat Out - Sakshi

సియోల్‌:  క్రిస్టియానో రొనాల్డోనా... మజాకా... అతనొస్తే వేలం వెర్రిగా టికెట్లు అమ్ముడవుతాయ్‌! మరి కోర్టా... మజాకా... అతను ఆడకపోతే ఆ డబ్బులన్నీ తిరిగివ్వాల్సిందే కదా!
సియోల్‌లో అప్పుడు జరిగిన మ్యాచ్‌లో సాకర్‌ స్టార్‌ ఆడకపోవడంతో ఇప్పుడు తిరిగి డబ్బు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. గతేడాది జూలైలో ‘ది ఫాస్టా’ సంస్థ కె–లీగ్‌ ఆల్‌స్టార్స్, యువెంటాస్‌ జట్ల మధ్య ఫ్రెండ్లీ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ నిర్వహించింది. అయితే ఆ సంస్థ పోర్చుగల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో యువెంటాస్‌ తరఫున బరిలోకి దిగుతాడని తెగ ప్రచారం చేసింది. దీంతో 65 వేల టికెట్లు మూడు నిమిషాల్లోపే అమ్ముడయ్యాయి. 

కొరియా కరెన్సీలో 30,000 వన్‌ల నుంచి 4,00,000 వన్‌ల వరకు (రూ.1800–రూ. 24,000) ధరలు వెచ్చింది టికెట్లు కొన్నారు. తీరా మ్యాచ్‌ వేదికైన సియోల్‌ వరల్డ్‌కప్‌ స్టేడియానికి వచ్చాక చూస్తే రొనాల్డో బెంచ్‌కే పరిమితమయ్యాడు. బరిలోకే దిగలేదు. ఇది అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరిచింది. కనీసం పది నిమిషాలైనా అతను ఆడి ఉంటే కొరియన్లంతా ఎంతో సంతోషంగా ఇంటికెళ్లేవారు. సాకర్‌ స్టార్‌ ఆడకపోవడంతో నిరాశ చెందిన ఇద్దరు అభిమానులు కోర్టుకెళ్లారు. విచారించిన ఇంచ్‌యోన్‌ జిల్లా కోర్టు ఒక్కొక్కరికి 3,71,000 వన్‌లు (రూ.22,285) చెల్లించాలని ‘ది ఫాస్టా’ సంస్థను ఆదేశించింది. (ఇక్కడ చదవండి: 20 కోట్ల ఫాలోవర్లు! )

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top