ఇలా కూడా ఫేమస్‌ అయిపోవచ్చా! | Will also become famous like this | Sakshi
Sakshi News home page

ఇలా కూడా ఫేమస్‌ అయిపోవచ్చా!

Jan 22 2017 2:10 AM | Updated on Oct 22 2018 6:05 PM

ఇలా కూడా ఫేమస్‌ అయిపోవచ్చా! - Sakshi

ఇలా కూడా ఫేమస్‌ అయిపోవచ్చా!

సామాజిక మాధ్యమాల్లో అందరి దృష్టిని ఆకర్షించి స్టార్‌డమ్‌ పొందాలంటే ఆషామాషీ కాదు.

సామాజిక మాధ్యమాల్లో అందరి దృష్టిని ఆకర్షించి స్టార్‌డమ్‌ పొందాలంటే ఆషామాషీ కాదు. అది కేవలం సినిమా నటులకో, క్రీడాకారులకో, ధనవంతులకో లేదా కాస్త చక్కనిరూపం ఉన్నవాళ్లకో సాధ్యమైన పని..  ఈ జాబితాలో లేకుండా పేరు సంపాదించాలంటే మాత్రం కష్టమైన పనే. అయితే తనకు ఇలాంటి అడ్డంకులేవీ లేవని  అయినప్పటికీ తాను పేరు గడించానంటోంది పోలాండ్‌లోని వార్సాకు చెందిన అమ్మాయి. ఆమె పేరు నటాలియా గుట్‌కివిజ్‌. నటాలియా అందరి లాంటి సాదాసీదా 20 ఏళ్ల అమ్మాయి. ఇన్‌స్ట్రాగామ్‌లో  కేవలం 443 పోస్టులు మాత్రమే చేసింది. కానీ ఒక లక్ష మంది ఫాలోవర్లను నటాలియా సంపాదించుకుంది. 

ఇదేలాగంటే సోషల్‌ మీడియాలో తన ఫొటోను పోస్ట్‌ చేసే ప్రతిసారీ ముఖం కనిపించకుండా జాగ్రత్త పడడమే. నటాలియా కళ్లు, పెదవులు లేదా వెనుక భాగమో కనిపించేలా మాత్రమే తను ఫొటో లను పోస్టు చేసేది. కాబట్టి తన ఎలా ఉంటుందో ఎవరికీ ఇంతవరకు తెలీదు. దీంతో ఆ అమ్మాయి ఎలా ఉంటుందా అనే ఆసక్తి అందరికీ నెలకొంది. నటాలియాను ఫాలో అయ్యేవారందరూ తన తదుపరి ఫొటోలో అన్నా పూర్తి ఫొటోను పోస్టు చేయకపోతుందా అంటూ కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తుంటారు. కానీ తాను మాత్రం ఫొటోను పోస్టు చేసిన ప్రతిసారి తన ముఖాన్ని కొంచెం కొంచెం మాత్రమే కనిపించేలా ఫోజులిస్తూ  ఆసక్తి రేకెత్తిస్తోంది. చూద్దాం నటాలియా ఎప్పుడూ తన పూర్తి రూపాన్ని బహిర్గతం చేస్తోందో. ఇక  మీరు కూడా ఆమెలా వినూత్నంగా ఆలోచించి మరో మార్గంలో గుర్తింపు పొందడానికి  ప్రయత్నించండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement