హోంవర్క్ చేసేందుకు సామ్‌సంగ్ సాయం

పాఠశాలల్లో టీచర్లు ఇచ్చే హోంవర్కులు తలకు మించిన భారంగా మారుతున్నాయి. ఈ క్రమంలో ఓ పాఠశాలలో విద్యార్థులకు టీచర్ ఇచ్చిన హోంవర్క్ ఓ పిల్లాడికి ఎన్నో కష్టాలు తెచ్చిపెట్టింది. ఇంతకీ ఆ హోంవర్క్ పూర్తి చేయాలంటే ఇంటర్నెట్ ఉండాలి. అయితే ఐదో తరగతి చదువుతున్న గులిహర్మే అనే పదేళ్ల పిల్లవాడి ఇంట్లో ఇంటర్నెట్ లేకపోవడంతో ఆలోచనలో పడ్డాడు. హోంవర్క్ చేయకపోతే టీచర్ ఊరుకోదు.. అలా అని హోంవర్క్ చేయడానికి ఇంటర్నెట్ లేదు. దీంతో వెంటనే దగ్గర్లోని సామ్‌సంగ్ స్టోర్‌కు వెళ్లాడు. అతని అవసరాన్ని గుర్తించిన సామ్‌సంగ్ సిబ్బంది ఓ ట్యాబ్‌లొ ఇంటర్నెట్ ఆన్ చేసి ఇచ్చారు. దీంతో ఆ బాలుడు అక్కడే భుజానికి స్కూల్ బ్యాగుతోనే నోట్స్ రాసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇప్పటివరకు ఈ వీడియోను 12 మిలియన్ల మందికి పైగా వీక్షించగా 4లక్షలకు పైగా లైకులు వచ్చిపడ్డాయి. అయితే ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ‘హోంవర్క్ చేయమని చెప్తే సరిపోతుందా? పిల్లల దగ్గర అందుకవసరమైన కంప్యూటర్లు లేనప్పుడు పాఠశాలలో ఉండే కంప్యూటర్లు వినియోగించుకునే వెసులుబాటు ఇవ్వాలి, అందుకోసం వారికి కాస్త సమయం కేటాయించాల’ని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరోవైపు పిల్లవాడి క్లాస్‌వర్క్ పూర్తి చేయడానికి సహకరించిన సామ్‌సంగ్ సిబ్బందికి కృతజ్ఞతలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆ పిల్లవాడి అవసరాన్ని గుర్తించిన సామ్‌సంగ్ నిర్వాహకులు అతనికి మూడు ట్యాబ్‌లు బహుమతిగా అందజేశారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి