వైరల్‌ వీడియో: నా గదిలో జెర్రీ ఉంది..!

Viral Video Arab Man Finds Jerry In Room And Ask Hotel To Bring Tom - Sakshi

ఇంగ్లీష్‌ భాషలో మనం ఒకటి మాట్లాడితే ఎదుటివాళ్లకు మరొలా అర్థం అవుతుందన్న విషయం తెలిసిందే. అలాంటి ఓ ఫన్నీ సంఘటన యూకేలోని ఓ హోటల్‌లో చోటు చేసుకుంది. అరబ్‌ దేశానికి చెందిన ఓ వ్యక్తి ఇంగ్లండ్‌లోని ఇంటర్ కాంటినెంటల్ అనే హోటల్‌ గదిలో విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. దాన్ని సదరు హోటల్‌  రిసెప్షనిస్ట్‌కు కొంచం హాస్య చతురతను జోడించి వ్యక్తం చేశాడు. తన గదిలో  ఉన్న పిల్లిని చూసి.. ‘నా గదిలో జెర్రీ ఉంది. వెంటనే నా గదికి ఒక టామ్‌ను తీసుకురండి. అప్పుడు ఆ టామ్‌ నా గదిలో ఉన్న జెర్రీని పట్టుకుంటుంది’ అని ఆ వ్యక్తి హోటల్‌ రిసెప్షనిస్ట్‌కు ఫోన్‌ చేశాడు.

దీంతో ఆ రిసెప్షనిస్ట్‌ అతను చేసిన ఫిర్యాదుకు ఒక్కసారిగా అవాక్కయ్యారు. తర్వాత అతను మాట్లాడిన ఫన్నీ ఫోన్‌ సంభాషణను ఓ ట్విటర్‌ యూజర్‌ తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశాడు. దీంతో ఆ ఫోన్‌ సంభాషణ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. దీనికిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. అదేవిధంగా టామ్‌ అండ్‌ జెర్రీకి సంబంధించిన పలు మీమ్స్‌ను నెటిజన్లు కామెంట్ల రూపంలో పోస్ట్‌ చేస్తున్నారు. అతను చేసిన ఫన్నీ సంభాషణకు నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటూ.. లైకులు, షేర్లు చేస్తున్నారు.
   

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top