పాపం కుక్క‌తో అంట్లు తోమిస్తున్నారు | Viral Photo: Dog Cleaning Dishes In Kitchen | Sakshi
Sakshi News home page

వైర‌ల్‌: గిన్నెలు క‌డుగుతున్న శున‌కం

Jun 14 2020 12:32 PM | Updated on Jun 14 2020 12:43 PM

Viral Photo: Dog Cleaning Dishes In Kitchen - Sakshi

ఇంట్లో గిన్నెలు తోమేది ఎవ‌రు? ఇదేం ప్ర‌శ్న‌! మ‌హిళ‌లే క‌దా అంటారేమో.. లాక్‌డౌన్‌లో భార్య‌లతో పాటు భ‌ర్త‌లు ప‌ని చేయ‌క త‌ప్ప‌లేదు. ఈ క్ర‌మంలో ఎంద‌రో భ‌ర్త‌లు మౌనంగా నాలుగు గోడ‌ల మ‌ధ్య అంట్లు తోమే ఉంటారు. స‌రే.. ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే ఇప్పుడు మ‌రో ప్ర‌శ్న‌. పెంపుడు జంతువులు కూడా అంట్లు తోముతాయా? అంటే పై ఫొటో అవున‌నే చెప్తోంది. అదెలాగంటే.. ఏదైనా తెలివిగా, తొంద‌ర‌గా నేర్చుకునే మూగ జీవాల్లో శున‌కం ముందు వ‌రుస‌లో ఉంటుంది. ఎన్నో అవ‌స‌రాల‌కు దాన్ని ఉప‌యోగిస్తున్నారు. (ఒంటి మీది బట్టల్లేకుండా నిరసన: ఎందుకంటే?)

ఈ క్ర‌మంలో వంట‌గ‌దిలో ఓ శున‌కం కుర్చీపై కూర్చుని బోళ్లు తోముతున్న ఫొటోను ముకుల్ సింగ్ అనే వ్య‌క్తి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. "ఎప్పుడూ అది ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఇక నుంచి ఇంటి ప‌నుల్లో సాయం చేస్తేనే దానికి ఆహారం.." అంటూ పేర్కొన్నాడు. దీనిపై కొంద‌రు జోకులు వేస్తుంటే మ‌రికొంద‌రు మాత్రం మూగ‌జీవాల‌ను వేధిస్తున్న య‌జ‌మానిపై  చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు. "పాపం దానికి ఆ ప‌ని చేయాల‌ని లేదు, కావాలంటే దాని మొహం చూడండి" అంటూ శున‌కంపై జాలి చూపిస్తున్నారు. (ఈ కుక్కకు అరుదైన ఘనత!)

Advertisement
 
Advertisement
Advertisement