చూసేందుకు సన్నగా కనిపిస్తున్న వీటి పేరు అడవి కుక్కలు (వైల్డ్ డాగ్స్). పులిని కూడా హతమార్చే సత్తా వీటికి ఉంటుందని, ఇవి గుంపులుగా చేరితే అడవిలో ఏజంతువైనా వెనుకడుగు వేయక తప్పదని అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు. జన్నారం అటవీ డివిజన్లో అడవి కుక్కలు పెద్దసంఖ్యలో ఉన్నాయని అధికారులు తెలిపారు. అటవీశాఖ అధికారులు అడవిలో అమర్చిన సీసీ కెమెరాలకు అడవి కుక్కల గుంపు చిక్కింది. ఈ ప్రాంతంలో పులి ఉండక పోవడానికి ఈ కుక్కలు కూడా ఓ కారణంగా చెప్పవచ్చు. – జన్నారం

వేటాడే చికిరా
బూడిదరంగు శరీరం, చాతి, పొట్టభాగంలో సన్నటి ఎర్రని చారలు, పదునైన ముక్కు, నారింజ ఆకారంలో కళ్లు ఉన్న ఈ పక్షి పేరు చికిరా. షికార్ అనే పదం నుండి చికిరా అనే పేరు వచ్చింది. ఇది ఓ వేట పక్షి. డేగ జాతికి చెందిన ఈ పక్షి చిన్న కీటకాలను, చిన్నచిన్న పక్షులను వేగంగా వేటాడుతుందని అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. మన దేశంతో పాటు ఆఫ్రికా, ఆసియా ఖండాల్లో ఇవి విరివిగా కనిపిస్తాయి. జన్నారం రేంజ్లో కనిపించిన ఈ పక్షిని ఎఫ్డీవో రామ్మోహన్ తన కెమెరాలో బంధించారు.
–మంచిర్యాల జిల్లా
ఇదీ చదవండి: సీఎం.. నా మేనమామే!


