భారత్‌తో బంధం చాలా ముఖ్యం

US wants to deepen defence ties with India - Sakshi

వాషింగ్టన్‌ : భారత్‌తో మరింత బలమైన రక్షణ సంబంధాలను అమెరికా కోరుకుంటోందని ఆ దేశ దక్షిణ, మధ్య ఆసియా సంబంధాల కార్యదర్శి జీ వెల్స్‌ స్పష్టం చేశారు. ధృఢమైన ద్వైపాక్షిక సంబంధాల వల్ల ఇరు దేశాల మధ్య వాణిజ్యం గణనీయంగా పెరుగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య రక్షణ, ద్వైపాక్షిక సంబంధాల్లో ఎప్‌-16, ఎఫ్‌-18 యుద్ధ విమానాల అమ్మకాలు కీలకపాత్ర పోషిస్తాయని ఆమె చెప్పారు.  అమెరికా రక్షణ కార్యదర్శి రెక్స్‌ టెల్లర్‌సన్స్‌ ఆఫ్ఘనిస్తాన్‌, పాకిస్తాన్‌, భారత్‌ల పర్యటన ముగించుకుని తిరిగి రాగానే.. ముఖ్య విషయంపై నిర్ణయం తీసుకునే అవకాశముందని చెప్పారు.

భారత్‌, అమెరికాల మధ్‌య ఏర్పడ్డ వ్యూహాత్మక భాగస్వామ్యం.. 21వ శతాబ్దాన్ని ప్రభావంతం చేస్తుందని ఆమె తెలిపారు. ఇండో పసిఫిక్‌ రీజియన్‌లో జపాన్‌, ఆస్ట్రేలియాలతో కలిసి పనిచేయడం వల్ల చైనా, ఇతర దేశాలను నిలువరించవచ్చన్నారు. భారత్‌తో అమెరికా మరింత లోతైన రక్షణ సంబంధాలను కోరుకుంటోందోని ఆమె తెలిపారు. ఈ దశాబ్దం ఆరంభంలో అధమస్థాయిలో ఉన్న రక్షణ వాణిజ్యం ప్రస్తుతం 15 బిలియన్‌ డాలర్లకు చేరుకుందని ఆమె అన్నారు. ఇరు దేశాల మధ్య అత్యంత ముఖ్యమైన రక్షణ ఒప్పందాలు జరిగాయని ఆమె గుర్తు చేశారు. ఇక 115 బిలియన్‌ డాలర్ల విలువ ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 140 బిలియన్‌ డాలర్లకు పెంచుకోవాలని ఆమె సూచించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top