డ్రగ్స్‌ ఓవర్‌ డోస్‌.. సింగర్‌ మృతి | US Rapper Found Dead At Home Aged 26 | Sakshi
Sakshi News home page

Sep 8 2018 9:36 AM | Updated on Apr 4 2019 3:20 PM

US Rapper Found Dead At Home Aged 26 - Sakshi

మ్యాక్‌ మిల్లర్‌ (ఫైల్‌ ఫొటో)

ప్రియురాలు దూరం కావడంతో తీవ్ర డిప్రేషన్‌లోకి..

లాస్‌ ఏంజెల్స్ ‌: అమెరికన్‌ ఫేమస్‌ ర్యాప్‌ సింగర్‌ మ్యాక్‌ మిల్లర్‌(26) మృతి చెందాడు. లాస్‌ ఏంజెల్స్‌లోని తన నివాసంలో అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మరణించాడని వైద్యులు పేర్కొన్నారు.  డ్రగ్స్‌ ఓవర్‌ డోస్‌ కావడంతో గుండెపోటు వచ్చిందని, దీంతోనే మ్యాక్‌ ప్రాణాలు విడిచాడని సన్నిహిత వర్గాలు తెలిపాయి. గత కొద్ది రోజులుగా తీవ్ర డిప్రెషన్‌లో ఉన్న ఈ ర్యాపర్‌ను వరుస సమస్యలు ఇబ్బంది పెట్టాయి. ప్రియురాలు అరియాన గ్రాండేతో బ్రేకప్‌.. హిట్‌ అండ్‌ రన్‌ కేసులో అరెస్ట్‌ కావడంతో మ్యాక్‌ తీవ్ర డిప్రేషన్‌లోకి వెళ్లాడు.

అంతేకాకుండా జూన్‌లో తన ప్రియురాలు గ్రాండే అమెరికా కమెడియన్‌ పిటె డెవిడ్సన్‌తో నిశ్చితార్థం చేసుకోవడం మ్యాక్‌ తట్టుకోలేకపోయాడని అతని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. 2012 నుంచి గ్రాండేను ప్రేమిస్తున్న మ్యాక్‌ 2017లో ఆమెతో విడిపోయాడు. వీరిద్దరు కలిసి ఎన్నో ఆల్బమ్స్‌ చేశారు. మ్యాక్స్‌ తన చివరి ఇంటర్వ్యూలో.. వచ్చిన ఫేమ్‌తో ఒత్తిడి నెలకొందని, దీంతోనే డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు స్పష్టం చేశాడు. ఇక చనిపోయే 12 గంటల ముందు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టాడు. అతని అకాల మరణం పట్ల అమెరికా సింగర్స్‌ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

1
1/1

మ్యాక్‌ మిల్లర్‌, అతని ప్రియురాలు అరియాన గ్రాండే (ఫైల్‌ ఫొటో)

Advertisement
 
Advertisement
Advertisement