జపాన్ లో మంచు తుపాను:11 మంది మృతి | Up to 11 dead in Japan snow storms, reports | Sakshi
Sakshi News home page

జపాన్ లో మంచు తుపాను:11 మంది మృతి

Dec 19 2014 4:59 PM | Updated on Sep 2 2017 6:26 PM

జపాన్ లో ఏర్పడ్డ మంచు తుపానుతో భయానక వాతావరణం చోటు చేసుకుంది.

టోక్యో:జపాన్ లో ఏర్పడ్డ మంచు తుపానుతో భయానక వాతావరణం చోటు చేసుకుంది. మంచు తుపాను కారణంగా ఇప్పటి వరకూ 11 మంది పైగా మృతి చెందినట్లు తాజాగా వెల్లడించిన ఓ ప్రకటనలో స్పష్టమైంది. వీరిలో 79 ఏళ్ల వృద్ధుడు ఒకరు మృతి చెందగా, మంచును శుభ్రం చేస్తుండగా 29 ఏళ్ల యువకుడు కూడా మృత్యువాత పడ్డాడు. శీతాకాలంలో ఏర్పడే మంచు తుపానుతో ఇక్కడ వాతావరణంలో భారీ మార్పులు వచ్చాయని నిపుణలు తెలిపారు.

 

ఈ తరహా వాతావరణం మరి కొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని వారు హెచ్చరించారు. గత కొన్ని రోజులుగా ఉత్తర, మధ్య జపాన్ లో వీచే బలమైన గాలుల కారణంగా వాతావరణంలో మార్పులు చేసుకున్నాయని వారు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement