breaking news
Japan snow storms
-
Japan Snow Storm: జపాన్లో మంచు తుఫాన్ విధ్వంసం..17 మంది మృతి
టోక్యో: జపాన్ వాసులు మంచు తుపాను ధాటికి వారం రోజులుగా వణికిపోతున్నారు. సంబంధిత ప్రమాద ఘటనల్లో 17 మంది చనిపోగా వంద మంది గాయపడ్డారు. వేలాదిగా ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తీవ్రంగా మంచు పేరుకుపోవడంతో రహదారులపై ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. సరుకు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈశాన్య జపాన్లో ఈ సీజన్లో సాధారణం కంటే మూడు రెట్లు ఎక్కువగా మంచు పడింది. చదవండి: అమెరికాను ముంచేసిన మంచు -
జపాన్ లో మంచు తుపాను:11 మంది మృతి
టోక్యో:జపాన్ లో ఏర్పడ్డ మంచు తుపానుతో భయానక వాతావరణం చోటు చేసుకుంది. మంచు తుపాను కారణంగా ఇప్పటి వరకూ 11 మంది పైగా మృతి చెందినట్లు తాజాగా వెల్లడించిన ఓ ప్రకటనలో స్పష్టమైంది. వీరిలో 79 ఏళ్ల వృద్ధుడు ఒకరు మృతి చెందగా, మంచును శుభ్రం చేస్తుండగా 29 ఏళ్ల యువకుడు కూడా మృత్యువాత పడ్డాడు. శీతాకాలంలో ఏర్పడే మంచు తుపానుతో ఇక్కడ వాతావరణంలో భారీ మార్పులు వచ్చాయని నిపుణలు తెలిపారు. ఈ తరహా వాతావరణం మరి కొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని వారు హెచ్చరించారు. గత కొన్ని రోజులుగా ఉత్తర, మధ్య జపాన్ లో వీచే బలమైన గాలుల కారణంగా వాతావరణంలో మార్పులు చేసుకున్నాయని వారు తెలిపారు.