అణు పరీక్ష.. ఐరాస ఎమర్జెన్సీ మీటింగ్‌ | UNO Security Council Emergency Meet after N.Korea Nuclear Test | Sakshi
Sakshi News home page

అణు పరీక్ష.. ఐరాస ఎమర్జెన్సీ మీటింగ్‌

Sep 4 2017 11:50 AM | Updated on Sep 17 2017 6:23 PM

అణు పరీక్ష.. ఐరాస ఎమర్జెన్సీ మీటింగ్‌

అణు పరీక్ష.. ఐరాస ఎమర్జెన్సీ మీటింగ్‌

ఉత్తర కొరియా అణు పరీక్ష నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి అత్యవసరంగా భేటీ అయ్యింది.

సాక్షి, వాషింగ్టన్‌: ఉత్తర కొరియా అణు పరీక్ష నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి స్పందించింది.  సోమవారం ఉదయం 10 గంటలకు భద్రతా మండలి అత్యవసరంగా భేటీ అయ్యింది. ఖండాత్గర క్షిపణి పేరిట కిమ్‌ జంగ్ నియంతృత్వ ప్రభుత్వం హైడ్రోజన్‌ బాంబును పరీక్షించిన విషయం తెలిసిందే.
 
 
ఈ మేరకు ఐరాస రాయబారి నిక్కీ హలె తన ట్విట్టర్‌ లో భేటీ అంశాన్ని ధృవీకరించారు. అమెరికాతోపాటు జపాన్‌, ఫ్రాన్స్; యూకే, దక్షిణ కొరియాలు భేటీలో పాల్గొని ఉత్తర కొరియా అణు పరీక్ష పై చర్చించనున్నట్లు ఆమె తెలిపారు. తమతోపాటు మిత్రపక్షాల జోలికి వస్తే భారీ సైనికచర్యకు దిగాల్సి ఉంటుందని అమెరికా సైన్యాధికారి జేమ్స్ మట్టిస్‌ తీవ్రంగా హెచ్చరించారు కూడా. ఇంకోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఉ.కొ. ఓ మూర్ఖపు దేశమంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. 
 
ఆరోసారి అణు పరీక్షలను నిర్వహించిన ఉత్తర కొరియాపై ప్రపంచ దేశాలన్నీ మండిపడుతున్నాయి. భారత్ కూడా తీవ్ర స్థాయిలో మండిపడింది. అణ్వాయుధాల విషయంలో అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించి ఉ.కొ. పెద్ద తప్పు చేసిందంటూ భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన వెలువరించింది కూడా.  ప్రస్తుతం బ్రిక్స్ సమావేశంలో ఈ అంశం హాట్ హాట్‌గా మారింది. 
 
ఉత్తర కొరియాపై మరిన్ని ఆంక్షలు విధించాల్సిందేనని భద్రతా మండలికి బ్రిటీష్ ప్రధాని థెరెసా విజ్ఞప్తి చేస్తుండగా, అవి ఎలాంటి ప్రభావం చూపబోవంటూ రష్యా పరోక్షంగా ఉత్తర కొరియాకు మద్ధతునిస్తూ వస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement