అమెరికా ‘షట్‌డౌన్’కు తెర.. బిల్లుపై ఒబామా సంతకం | United States 'shutdown' closed, Barack Obama signs on bill | Sakshi
Sakshi News home page

అమెరికా ‘షట్‌డౌన్’కు తెర.. బిల్లుపై ఒబామా సంతకం

Oct 17 2013 11:11 AM | Updated on Apr 4 2019 5:04 PM

అమెరికా ‘షట్‌డౌన్’కు తెర.. బిల్లుపై ఒబామా సంతకం - Sakshi

అమెరికా ‘షట్‌డౌన్’కు తెర.. బిల్లుపై ఒబామా సంతకం

అమెరికాలో రెండు వారాలకుపైగా కొనసాగిన ప్రభుత్వ కార్యాలయాల నిలిపివేత (షట్‌డౌన్), రుణ పరిమితి పెంపు సంక్షోభానికి ఎట్టకేలకు తెరపడింది.

అమెరికాలో రెండు వారాలకుపైగా కొనసాగిన ప్రభుత్వ కార్యాలయాల నిలిపివేత (షట్‌డౌన్), రుణ పరిమితి పెంపు సంక్షోభానికి ఎట్టకేలకు తెరపడింది. షట్డౌన్కు ముగింపు పలుకుతూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబమా గురువారం ఉదయం బిల్లుపై సంతకం చేశారు. వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ జే కార్నీ ఓ ప్రకటనలో ఈ విషయం వెల్లడించారు. బిల్లుకు  సంబంధించి పాలక డెమోక్రాట్లు-ప్రతిపక్ష రిపబ్లికన్లు ఓ అంగీకారానికి రావడం సమస్య పరిష్కారానికి దోహదపడింది. బుధవారం అర్ధరాత్రి యూఎస్ కాంగ్రెస్ ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందింది.

డిఫాల్ట్ గడప ముందు ఉన్న అమెరికాకు తాజా పరిణామాలతో పెద్ద ఊరట లభించినట్లయ్యింది. షట్‌డౌన్‌కు తెరపడి.. ప్రభుత్వ కార్యాలయాలు తెరచుకునేందుకు మార్గం సుగమమైంది. అమెరికాకే గాక ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఉపశమనం కలిగినట్టయింది. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు జిమ్ యంగ్ కిమ్ స్వాగతించారు.

ఒబామా ఆరోగ్య బీమా పథకం(ఒబామాకేర్)పై  వ్యతిరేకతతో రిపబ్లికన్‌లు బడ్జెట్ బిల్లుకు ఆమోదం తెలపకపోవడంతో.. 17 ఏళ్ల తర్వాత తొలిసారి షట్‌డౌన్‌కు దారితీసిన సంగతి తెలిసిందే. దీంతో 8 లక్షల మందికిపైగా ప్రభుత్వోద్యోగులు విధులకు దూరమయ్యారు.  అత్యవసర సేవలు మినహా ఇతర ప్రభుత్వ సేవలన్నీ నిలిచిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement