ఓ మై ఫ్రెండ్.. | Unbelievable Friendship between Leopard and Deer | Sakshi
Sakshi News home page

ఓ మై ఫ్రెండ్..

Dec 24 2014 4:04 AM | Updated on Sep 2 2017 6:38 PM

ఓ మై ఫ్రెండ్..

ఓ మై ఫ్రెండ్..

మన స్నేహితులతో ఎలా భుజంపై చేయి వేసి మాట్లాడుతామో.. ఇక్కడ కూడా దాదాపు అదే సీన్ కనిపిస్తోంది కదూ.. అయితే.. ఇది కాస్త అరుదైన సన్నివేశం.

మన  స్నేహితులతో ఎలా భుజంపై చేయి వేసి మాట్లాడుతామో.. ఇక్కడ కూడా దాదాపు అదే సీన్ కనిపిస్తోంది కదూ.. అయితే.. ఇది కాస్త అరుదైన సన్నివేశం. చిరుతపులి, జింక స్నేహం గురించి మనం వినలేదు.. కనలేదు.. దక్షిణాఫ్రికాకు చెందిన ఎస్టియాన్ కూడా అలాగే అనుకున్నాడు ఈ సీన్ చూసేదాకా.. అక్కడి క్రూగర్ జాతీయ పార్కులో ఇటీవల ఈ అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. ఈ పిల్ల జింక, పిల్ల చిరుతలు ఒకదానితో ఒకటి ఆడుకోవడాన్ని ఇతడు క్లిక్‌మనిపించాడు.

తాను గతంలో ఎన్నడూ ఇలాంటిది చూడలేదని.. ఇకముందు కూడా చూస్తానని అనుకోవడం లేదని అన్నాడు. దాదాపు గంటపాటు ఈ స్నేహం కొనసాగిందట. తర్వాత చిరుతపులులు ఓ పొద వెనక్కు వెళ్లాయని.. జింక కూడా అదే వైపు వెళ్లిందని చెప్పాడు. ఆ తర్వాత ఏమైందో తనకు తెలియదని.. పర్యాటకులతోపాటు తానూ అక్కడి నుంచి వచ్చేశానని చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement