కరోనా దెబ్బకు కుప్పకూలిన ‘ఫ్లైబీ’

UK Airline Flybe Collapses As Coronavirus Outbreak Takes Toll - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బ్రిటన్, యూరప్‌ దేశాల మధ్య అత్యధిక పౌర విమాన సర్వీసులను నడుపుతున్న అతి పెద్ద ప్రాంతీయ విమాన సర్వీసుల సంస్థ ‘ఫ్లైబీ’ గురువారం నాడు కుప్పకూలి పోయింది. ఇంకేమాత్రం విమాన సర్వీసులను నడపలేమంటూ చేతులు ఎత్తేసింది. ఫలితంగా యూరప్‌ అంతటా విమానాశ్రయాల్లో వేలాది మంది ప్రయాణికులు చిక్కుబడి పోయారు. ఎలా గమ్యస్థానాలకు వెళ్లాలో తెలియక వారు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ విమాన సంస్థ చేతులెత్తేసిన కారణంగా రెండు వేల మందికి పైగా ఉద్యోగులు రోడ్డున పడ్డారు.

గతంలో మోనార్క్‌ ఏర్‌లైన్స్, థామస్‌ కుక్‌ ఏర్‌లైన్స్‌ ఇలాగే కుప్పకూలిపోయినప్పుడు యూరప్‌లో చిక్కుబడి పోయిన ప్రయాణికులను తమ గమ్య స్థానాలకు చేర్చాల్సిందిగా పౌర విమానయాన అధికార యంత్రాంగాన్ని బ్రిటన్‌ రవాణా శాఖ ఆదేశించింది. 2017లో మోనార్క్‌ ఏర్‌లైన్స్‌ మూత పడినప్పుడు వివిధ విమానాశ్రయాల్లో చిక్కుబడి పోయిన ప్రయాణికులను చేరవేసేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం 60 మిలియన్‌ పౌండ్ల డబ్బుతో బ్రిటన్‌ ప్రభుత్వం అద్దె విమానాలను నడిపింది. థామస్‌ కుక్‌ ఏర్‌లైన్స్‌ మూత పడినప్పుడు ప్రయాణికుల చేరవేతకు అంతకన్నా ఎక్కువ ఖర్చయినట్లు తెల్సింది. 

(చదవండి : దుబాయ్‌లో భారతీయ విద్యార్థికి కరోనా)

రద్దయిన విమానాల ప్రయాణికుల ఖర్చును కొన్ని బీమా కంపెనీలు చెల్లిస్తాయి. అన్ని పాలసీలు ఒకేలా ఉండవు కనుక అన్ని రద్దయిన విమానాల చార్జీలను అవి భరించలేవు. హాలీడే మేకర్స్‌ మాత్రం తమ ప్రయాణికుల చార్జీలను డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డుల ద్వారా చెల్లించగలవు. విమాన టిక్కెట్లతోపాటు హోటల్‌ రూమ్‌లు, కారు సర్వీసులను ప్యాకేజీ డీల్‌ కింద అందజేసే హాలీడే మేకర్స్‌ మాత్రం ప్రయాణికుల టిక్కెట్‌ చార్జీలీను వెనక్కి చెల్లించగలవు. 

(చదవండి : అమెజాన్‌, ఫేస్‌బుక్‌కు కరోనా సెగ )

జనవరి నుంచి నష్టాలను చవి చూస్తున్న ‘ఫ్లైబీ’ పౌర విమానయాన సంస్థ కరోన వైరస్‌ కారణంగా నష్టాలు విపరీతంగా పెరగడంతో గత రాత్రి మూసివేతను ప్రకటించింది. అనివార్యమైన ఈ పరిస్థితికి తీవ్రంగా చింతిస్తున్నామంటూ ఫ్లైబీ సీఈవో మార్క్‌ ఆండర్సన్‌ సిబ్బందికి రాసిన ఓ లేఖలో విచారం వ్యక్తం చేశారు. కరోనా వైరస్‌ కారణంగా పర్యాటక ప్యాకేజీలు లేకపోవడం, వ్యాపారస్థుల పర్యటనలు భారీగా పడిపోవడంతో బ్రిటిష్‌ ఏర్‌వేస్, వర్జిన్‌ అట్లాంటిక్‌ సహా పలు అంతర్జాతీయ విమాన సర్వీసుల సంస్థ లగ్జరీ క్లాస్‌ టిక్కెట్లను 60 శాతం తగ్గించి నడుపుతున్నాయి. కరోనా భయాందోళనలు ఇలాగే కొనసాగితే వాటి మనుగడకు కూడా ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. 

(చదవండి : కోడికి కరోనా బూచి)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top