భర్త పబ్‌జీ గేమ్‌ వద్దనడంతో.. | UAE Woman Seeks Divorce From Husband Over PUBG Row | Sakshi
Sakshi News home page

భర్త పబ్‌జీ గేమ్‌ వద్దనడంతో..

May 1 2019 9:32 AM | Updated on May 1 2019 9:32 AM

UAE Woman Seeks Divorce From Husband Over PUBG Row - Sakshi

యువజంట కాపురంలో పబ్‌జీ చిచ్చు

న్యూఢిల్లీ : పబ్‌జీ గేమ్‌ వద్దని భర్త వారించడంతో విడాకులు కోరిన భార్య ఉదంతం వెలుగుచూసింది. యూఏఈలో ఓ యువతి తన భర్త పబ్‌జీ గేమ్‌ ఆడవద్దని చెప్పడంతో ఆయనతో ఏకంగా విడాకులు కోరినట్టు గల్ఫ్‌ పోలీసులు వెల్లడించారు. తనకు కావాల్సిన వినోదాన్ని ఎంచుకునే హక్కును తన భర్త కాలరాశాడని ఆమె భగ్గుమన్నారు.

పబ్‌జీ గేమ్‌ను తాను కేవలం తన స్నేహితులు, బంధువులతో ఆడతానని ఆమె చెప్పుకొచ్చారు. అయితే తన భార్య స్వేచ్ఛను తాను హరించలేదని, కేవలం కుటుంబంతో సమయం వెచ్చించేందుకే పబ్‌జీకి దూరంగా ఉండాలని కోరానని భర్త వాపోయారు. పబ్‌జీ గేమ్‌ దుమారం చివరికి యువ జంట విడాకుల వరకూ వెళ్లడంతో గల్ఫ్‌ పోలీసులు విస్తుపోయారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement