ట్విట్టర్ లో ఇక 'లవ్' | Twitter swaps the 'favorite' for the 'like' | Sakshi
Sakshi News home page

ట్విట్టర్ లో ఇక 'లవ్'

Nov 4 2015 10:50 PM | Updated on Sep 3 2017 12:00 PM

ట్విట్టర్ లో ఇక 'లవ్'

ట్విట్టర్ లో ఇక 'లవ్'

కొత్త యూజర్స్ను ఆకర్షించే పనిలో భాగంగా ట్విట్టర్ తన అఫ్లికేషన్లో కొత్త మార్పులు చేపట్టింది.

కొత్త యూజర్స్ను ఆకర్షించే పనిలో భాగంగా ట్విట్టర్ తన అఫ్లికేషన్లో కొత్త మార్పులు చేపట్టింది. దీనిలో భాగంగానే ఫేవరెట్ ఆప్షన్ బదులుగా లైక్ను తీసుకొచ్చింది. ఇంతకు ముందున్న స్టార్ సింబల్ స్థానంలో హార్ట్(లవ్) సింబల్ను ప్రవేశ పెట్టారు. ఇంతకు ముందు ఫేవరేట్ ఆప్షన్ స్టార్ సింబల్తో ఉండేది. ప్రస్తుతం ప్రవేశపెట్టిన లైక్ ఆప్షన్..హార్ట్ సింబల్తో ఉంది. ఎదైనా ట్విట్ నచ్చితే లైక్ కొట్టగానే ఎరుపు రంగుతో దీపావళి టపాసుల్లా  పేలినట్టుగా వచ్చి చాలా ఆకర్షనీయంగా ఉంది.

ఫేవరేట్ ఆఫ్షన్ తొలుత 2006లో ఉపయోగంలోకి వచ్చింది. అందరికి సుపరిచితమైన ఫేస్ బుక్ లైక్ ఆప్షన్ 2009లో ప్రారంభంలోకి వచ్చింది. మరోవైపు ట్విట్టర్ అనుబంధంగా ఉన్న లైవ్ వీడియో స్ట్రీమింగ్ ఆప్ పెరిస్కోప్లో ఇప్పటికే హార్ట్ సింబల్ను యూజర్స్ విరివిగా ఉపయోగిస్తున్నారు. దీంతో యూజర్స్కు సులువుగా ఉపయోగపడేలా, ట్విట్ లని లైక్ చేయడానికి హార్ట్ సింబల్ అనువుగా ఉంటుందని ట్విట్టర్ ఎంచుకుందని విశ్లేషకులు చెబుతున్నారు.  

'చాలా వాటిని ఇష్టపడోచ్చు కానీ అన్ని ఫేవరేట్ అయ్యే అవకాశం లేదు కదా' అని ఫేవరేట్ స్థానంలో లైక్ ఆప్షన్ ప్రవేశపెట్టడానికి కారణాన్ని ట్విట్టర్ ప్రోడక్ట్ మేనేజర్ ఆకర్షణ్ కుమార్ తన బ్లాగ్ లో పేర్కొన్నారు. హార్ట్ సింబల్ ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందినది కావడంతో స్టార్ స్థానంలో దాన్ని ఉంచామన్నారు. అయితే దాన్ని తప్పనిసరిగా వాడాల్సిన అవసరం లేదని, కావాలంటే క్రోమ్ బ్రౌజర్ నుంచి వెబ్ స్టోర్ లోకి వెళ్లి స్టార్ ఆకారాన్ని తిరిగి ఇన్స్టాల్ చేసుకోవచ్చని ట్విట్టర్ తెలిపింది.



 

Advertisement
 
Advertisement
Advertisement