విమానం కేబిన్లో బాంబు | Turkish flight makes emergency landing at IGI airport following bomb threat | Sakshi
Sakshi News home page

విమానం కేబిన్లో బాంబు

Jul 7 2015 2:47 PM | Updated on Sep 3 2017 5:04 AM

విమానం కేబిన్లో బాంబు

విమానం కేబిన్లో బాంబు

న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టర్కిష్ ఎయిర్ లైన్స్ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో బాంబు కనిపించడంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది.

న్యూఢిల్లీ:  న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టర్కిష్ ఎయిర్ లైన్స్ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. బ్యాంకాక్ నుంచి ఇస్తాంబుల్ కు సుమారు 148 మంది ప్రయాణికులతో బయలుదేరిన టర్కిష్ ఎయిర్ లైన్స్ విమానంలో ఉన్నట్టుండి బాంబు కనిపించింది. దీంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది.  క్యాబిన్లో  బాంబును కనుగొన్న పైలట్.. వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేశారని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు వెల్లడించారు. ఆ సమయానికి దగ్గరలో ఉన్న న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అనుమతి తీసుకుని అత్యవసరంగా విమానాన్ని కిందకు దించారు.

 

దీంతో న్యూఢిల్లీ విమానాశ్రయంలో అత్యవర పరిస్థితిని ప్రకటించారు. అన్ని భద్రతా దళాలతో పాటు నేషనల్ సెక్యూరిటీ దళాలను  అప్రమత్తం చేసి హై ఎలర్ట్ ప్రకటించారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ , అగ్నిమాపక దళాలు హుటాహుటిన విమానాశ్రయానికి చేరుకున్నాయి. విమానం లోపల, రన్ వే తదితర ఏరియాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. దీనిపై ఎన్ఎస్జీ అధికారులు, ఇతర సీనియర్ అధికారులు  ప్రత్యేకంగా సమావేశం కానున్నారని సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement