ట్రంప్‌ టవర్‌లో అగ్ని ప్రమాదం..ఒకరు మృతి | Trump Tower fire leaves man dead and 6 firefighters injured | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ టవర్‌లో అగ్ని ప్రమాదం..ఒకరు మృతి

Apr 9 2018 3:13 AM | Updated on Sep 5 2018 9:47 PM

Trump Tower fire leaves man dead and 6 firefighters injured - Sakshi

న్యూయార్క్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు చెందిన ట్రంప్‌ టవర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు. న్యూయార్క్‌ ఫిఫ్త్‌ అవెన్యూలో ఉన్న ట్రంప్‌ టవర్‌లోని 50వ అంతస్తులో శనివారం రాత్రి 7 గంటల సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

అగ్నిమాపక సిబ్బంది దాదాపు రెండు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. 50వ అంతస్తులో నివాసం ఉండే టాడ్‌ బ్రాస్నెర్‌(67) అనే వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే, కొద్దిసేపటి తర్వాత అతడు చనిపోయాడని అధికారులు తెలిపారు. మొత్తం 58 అంతస్తులున్న ట్రంప్‌ టవర్‌లో ట్రంప్‌ వ్యాపార సంస్థల ప్రధాన కార్యాలయం 26వ అంతస్తులో ఉంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement