అమెరికాలో భారతీయుడికి కీలక పదవి | Trump May Appoint Indian-American To President Advisory Committee | Sakshi
Sakshi News home page

అమెరికాలో భారతీయుడికి కీలక పదవి

Jan 19 2019 3:57 AM | Updated on Jan 19 2019 3:57 AM

Trump May Appoint Indian-American To President Advisory Committee - Sakshi

ప్రేమ్‌ పరమేశ్వరన్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ యంత్రాంగంలో మరో భారత సంతతి అమెరికన్‌కు కీలక పదవి లభించనుంది. ప్రముఖ ఆర్థికరంగ నిపుణుడు ప్రేమ్‌ పరమేశ్వరన్‌(50) ‘ఏషియన్‌–అమెరికన్స్, పసిఫిక్‌ ఐలాండర్స్‌ అడ్వైజరీ కమిషన్‌’లో సభ్యుడిగా నియమించేందుకు ట్రంప్‌ అంగీకరించినట్లు అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ తెలిపింది. న్యూయార్క్‌లో స్థిరపడ్డ పరమేశ్వరన్‌ ప్రస్తుతం ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ ఉత్తర అమెరికా విభాగం అధ్యక్షుడిగా, గ్రూప్‌ సీఎఫ్‌వోగా పనిచేస్తున్నారు. ఇండో–అమెరికన్లతో పాటు అగ్రరాజ్యంలో స్థిరపడ్డ పసిఫిక్‌ ద్వీపవాసుల ఆరోగ్యం, విద్య, ఆర్థిక వృద్ధిని మెరుగుపర్చేందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఈ సలహా కమిషన్‌ను తొలుత ఏర్పాటుచేశారు. ఇందులో వాణిజ్యం, ఆరోగ్యం, విశ్వవిద్యాలయాలు, ఎన్జీవోలు సహా వేర్వేరు రంగాలకు చెందిన నిపుణులు సభ్యులుగా ఉంటారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement