డీఏసీఏ పథకం దాదాపు ముగిసింది: ట్రంప్‌ | Trump administration will ask Supreme Court to allow it to end DACA | Sakshi
Sakshi News home page

డీఏసీఏ పథకం దాదాపు ముగిసింది: ట్రంప్‌

Jan 17 2018 2:55 AM | Updated on Apr 4 2019 3:25 PM

Trump administration will ask Supreme Court to allow it to end DACA - Sakshi

వాషింగ్టన్‌: తల్లిదండ్రులతోపాటు చిన్నతనంలోనే అక్రమంగా అమెరికా వచ్చిన స్వాప్నికులు (డ్రీమర్స్‌)కు రక్షణ కల్పిస్తున్న డీఏసీఏ (బాల్యంలో వచ్చిన వారిపై చర్యల వాయిదా) పథకం దాదాపు ముగిసిపోయిందనీ, ఇందుకు కారణం డెమొక్రాటిక్‌ పార్టీ సభ్యులేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిందించారు. ‘డీఏసీఏ పథకం దాదాపు ముగిసింది. ఈ పథకం డెమోక్రాట్లకు ఇష్టం లేదు.

వారు కేవలం మాట్లాడతారు. సైన్యానికి అవసరమైన డబ్బును దూరం చేసేందుకే వారున్నారు’ అంటూ ట్రంప్‌ ఆదివారం ఓ ట్వీట్‌ చేశారు. డీఏసీఏను రద్దు చేసే నిర్ణయాన్ని అమెరికాలోని ఓ కోర్టు పక్కనబెట్టడంతో ప్రభుత్వం మళ్లీ డీఏసీఏ రెన్యువల్‌ దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించిన కొన్ని గంటల్లోనే ట్రంప్‌ ఈ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం అమెరికాలో స్వాప్నికులు దాదాపు 8 లక్షల మంది ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement