ఒబామాను ఆపేసిన బుడ్డోడు!! | Toddler breaches security at White House, made obama wait | Sakshi
Sakshi News home page

ఒబామాను ఆపేసిన బుడ్డోడు!!

Aug 9 2014 10:26 PM | Updated on Apr 4 2019 5:04 PM

ఒబామాను ఆపేసిన బుడ్డోడు!! - Sakshi

ఒబామాను ఆపేసిన బుడ్డోడు!!

బుడిబుడి అడుగులు వేసే ఓ బుడ్డోడు.. సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను ఆపేశాడంటే నమ్మగలరా?

బుడిబుడి అడుగులు వేసే ఓ బుడ్డోడు.. సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను ఆపేశాడంటే నమ్మగలరా? కానీ ఇది జరిగింది. ఎక్కడో కాదు.. ఏకంగా శ్వేత సౌధంలోనే! ఇరాక్ సమస్య గురించి జాతినుద్దేశించి ప్రసంగించేందుకు బరాక్ ఒబామా సిద్ధం అవుతుండగా.. ఉన్నట్టుండి ఓ బుడ్డోడు అడ్డురావడంతో ఆయన ప్రసంగం కొద్దిసేపు ఆపేయాల్సి వచ్చింది. పటిష్ఠమైన భద్రతావలయాన్ని ఛేదించుకుని మరీ వైట్హౌస్లోని ఉత్తరంవైపున్న లాన్లోకి ఆ బుడ్డోడు వచ్చేశాడు.

వైట్హౌస్ ఫెన్సింగ్ లోపలి నుంచి ఎలాగోలా దూరిపోయి ఆ బుడ్డోడు లోపలకి వచ్చేశాడు. సరిగ్గా కొద్దిసేపట్లో ఒబామా ప్రసంగించాల్సి ఉంది. అయితే, చిన్న పిల్లాడు వచ్చిన విషయం గమనించి, కాసేపు అధ్యక్షుడి ప్రసంగం ఆపించి, బుడ్డోడిని వాళ్ల అమ్మానాన్నల వద్దకు పంపారు. దాంతో అమెరికా అధ్యక్షుడినే నిలువరించి ఆ బుడ్డోడు చరిత్ర సృష్టించినట్లయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement