45 నిమిషాల పాటు వణికిన పోలీసులు..

Tiger Toy Made Police Stand off for 45 minutes - Sakshi

అబెర్డీన్‌షైర్‌, స్కాట్లాండ్‌ : రాత్రి పూట కావలి కాస్తున్న ఓ పోలీసు టీం 45 నిమిషాల పాటు భయంతో వణికిపోయింది. శనివారం అర్థరాత్రి సమయంలో అబెర్డీన్‌షైర్‌ పట్టణంలోని ఈశాన్య పోలీసు డివిజన్‌కు ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. తాను ప్రమాదంలో ఉన్నానని, తన పొలంలోకి పెద్దపులి వచ్చిందని వెంటనే వచ్చి రక్షించాలని బాధితుడి ఫోన్‌లో గగ్గోలుపెట్టాడు.

దీంతో హుటాహుటిన వ్యక్తి పొలం వద్దకు చేరుకున్న పోలీసులు రోడ్డుపై పడుకున్న పులిని చూశారు. హఠాత్తుగా పులిని దగ్గరగా చూసిన అధికారులు భయంతో వణికిపోయారు. దాదాపు 45 నిమిషాల పాటు పులి వైపు వెళ్లకుండా నిల్చుండిపోయారు. ఎంతకీ పులి కదలకపోతుండటంతో వారికి అనుమానం కలిగింది. భయంభయంగానే అడుగులో అడుగు వేసుకుంటూ దాని దగ్గరకు వెళ్లగా నిజమైన పులి కాదని తేలింది.

పులి బొమ్మను ఎవరో కావాలని ఇలా రోడ్డుపై పెట్టి భయభ్రాంతులకు గురి చేశారని తెలిసి నాలుక కరచుకోవడం అధికారుల వంతైంది. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. పొలంలో ఉన్న బొమ్మను చూసి నిజమైన పులి అనుకుని రైతు చాలా భయపడిపోయాడని పోలీసులు పేర్కొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top