గోడలోకి తొంగి చూడొచ్చు!

There is a way to see through walls of unknown materials - Sakshi

వాషింగ్టన్‌: గోడలకు చెవులుంటాయని విన్నాం. కానీ గోడ అవతల కళ్లుంటాయనే విషయాన్ని కూడా ఇకపై గుర్తుంచుకోవాలి. ఎందుకంటే గోడకు అవతలివైపు ఏం జరుగుతుందో ఇటువైపు ఉండి చూడొచ్చట. ఇందుకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని శాస్త్రవేత్తలు ఎప్పుడో అభివృద్ధి పర్చారు. అయితే ఆ టెక్నాలజీ అత్యంత ఖరీదైనదే కాకుండా సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడం కష్టసాధ్యమైనది కావడంతో అంతగా ఉపయోగంలోకి రాలేదు. అయితే అమెరికాలోని డ్యూక్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చాలా తక్కువ ఖర్చుతో గోడ లోపల ఏముందో తెలుసుకునే కొత్త టెక్నాలజీని స్కానర్‌ను అభివృద్ధి చేశారు.

ఈ స్కానర్‌ ప్రత్యేకత ఏంటంటే... అంత్యంత తక్కువ తరంగదైర్ఘ్యం కలిగిన సింగిల్‌ ఫ్రీక్వెన్సీ మైక్రోవేవ్స్‌ను ఉపయోగించడమే. ఇవి గోడలో అడ్డుగా ఉన్న ఇటుక, కంకర, ఇనుము వంటివాటిని సులువుగా ఛేదించుకొని లోపలికి వెళ్లిపోతాయట. దీనివల్ల గోడలో ఎదుయ్యే సమస్యలను గుర్తించవచ్చని... ముఖ్యంగా నిర్మాణరంగ నిపుణులకు ఇది ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top