బీర్.. తాగాలా? వద్దా? | The surprising health benefits of drinking one or two glass beer | Sakshi
Sakshi News home page

బీర్.. తాగాలా? వద్దా?

Apr 28 2016 10:42 PM | Updated on Sep 3 2017 10:58 PM

బీర్.. తాగాలా? వద్దా?

బీర్.. తాగాలా? వద్దా?

చాలా మందికి బీర్ తాగాలా.. వద్దా.. అని సంశయం ఉంటుంది. అయితే ఈ విషయాలను ఓసారి గమనిస్తే ఏం చేయాలన్నది మీరే డిసైడ్ అయిపోతారు.

చాలా మందికి బీర్ తాగాలా.. వద్దా.. అని సంశయం ఉంటుంది. అయితే ఈ విషయాలను ఓసారి గమనిస్తే ఏం చేయాలన్నది మీరే డిసైడ్ అయిపోతారు. మహిళలు వారానికి కనీసం రెండు బీర్లు తాగితే గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయని గతంలో ఎన్నో సర్వేలలో తేలింది. బీర్లు తాగని మహిళలతో పోలిస్తే ఈ అలవాటన్న మహిళలకు గుండెపోటు వచ్చే అవకాశాలు 30 శాతం తక్కువగా ఉంటాయని ఓ పరిశోధనలో తేలింది. వీటితోపాటు తాజాగా ఓ సర్వేలో బీర్ తాగడం వల్ల ఎలాంటి ఫలితాలున్నాయో వెల్లడైంది.

బీర్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:

  • రెగ్యూలర్ గా (వారంలో రెండు, మూడుసార్లు) బీర్ తాగే వాళ్లకు కిడ్నీ సమస్యలు తగ్గుతాయి. కిడ్నీలో రాళ్లు ఏర్పడటం లాంటి ఆనారోగ్యం వాటిల్లే అవకాశాలు తక్కువ. బీర్ తాగే 27 వేల మంది నుంచి సమాచారం సేకరించగా, ఈ సమస్య 40 శాతానికి పైగా తగ్గిపోతుంది.
  • గుండె సంబంధిత రోగాలు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. 2 వేల మందిపై సర్వే చేయగా గుండె సమస్యలు రావడం తగ్గినట్లు కనుగొన్నారు.
  • గుండె సంబంధిత రోగాలతో పాటు గుండెపోటు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయట. బీర్ సేవించని వారితో పోల్చి చూస్తే తాగే వారిలో రక్తప్రసరణ బాగా జరిగి గుండెపోటు సమస్యలు తగ్గిపోయాయి.
  • ఎముకలలో పటుత్వం పెంచడానికి బీర్ దోహదపడుతుంది. రోజు రెండు గ్లాసుల బీర్ తాగితే ఎముకలు కాస్త గట్టిపడతాయి.
  • చాలా మందిని భయపెట్టే వ్యాధి షుగర్. అయితే ప్రతిరోజూ ఒకటి, రెండు గ్లాసుల బీర్ తాగితే టైప్2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు 25 శాతం పైగా తగ్గుతాయని సర్వేలో తేలింది.
  • అల్జీమర్స్ వ్యాధి రాకుండా చేస్తుంది. మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. మెదడుకు రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది. దీంతో మెదడు చురుకుగా పనిచేస్తుంది.
  • కొన్ని రకాల క్యాన్సర్ కారకాలను మన నుంచి దూరం చేస్తుంది. వారంలో రెండు, మూడుసార్లు ఒకట్రెండు సార్లు బీర్ తాగితే కొన్ని రకాల క్యాన్సర్ వ్యాధి మన ధరికి చేరదట.
  • దృష్టి లోపాలున్న వారికి మేలు చేస్తుంది. కొన్ని రకాల దృష్టిలోపాలను సవరించడంలో బీర్ కీలకపాత్ర పోషిస్తుంది. మైటోకాండ్రియాలను కాపాడటంతో అవి కాటరాక్ట్ లో లోపాలు తలెత్తకుండా చేస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement