అతి భారీ కృష్ణబిలం! | Sakshi
Sakshi News home page

అతి భారీ కృష్ణబిలం!

Published Wed, Sep 6 2017 2:31 AM

అతి భారీ కృష్ణబిలం!

టోక్యో: మన పాలపుంత కేంద్ర భాగంలో అతి భారీ కృష్ణబిలాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. సూర్యుడి కంటే దాదాపు లక్ష రెట్లు ఎక్కువ పరిమాణాన్ని ఇది కలిగి ఉంటుందని తెలిపారు. ఇది మన పాలపుంత కేంద్ర భాగంలో ఉన్న విష వాయువుల సమూహం వెనుక దాక్కుని ఉందన్నారు. మన గెలాక్సీలోని ‘సాజిటేరియస్‌ ఏ’ అనే కృష్ణ బిలం ఇప్పటివరకు అత్యంత పెద్దది.

అయితే, ప్రస్తుతం కనుగొన్న ఈ కృష్ణబిలం రెండో అతిపెద్దది అయ్యి ఉండవచ్చని  భావిస్తున్నారు. మన పాలపుంత కేంద్ర భాగానికి దాదాపు 200 కాంతి సంవత్సరాల దూరంలో ఈ కృష్ణబిలం ఉంది. ఇది దాదాపు 150 ట్రిలియన్‌ కిలోమీటర్ల మేర వ్యాపించి ఉన్నట్లు పేర్కొన్నారు. కృష్ణబిలం దగ్గర నుంచి రేడియో తరంగాలు ఉద్భవిస్తున్నాయి.
 

Advertisement
Advertisement