అంతరిక్షంలో బంగారం!

Twin stars are on collision course. Their explosion will produce gold - Sakshi

వాషింగ్టన్‌:  మన పాలపుంతలో గ్రహాలతోపాటు కోట్ల సంఖ్యలో నక్షత్రాలు ఉన్నాయి. సమీపంలోని రెండు నక్షత్రాలు పరస్పరం ఢీకొని శక్తివంతమైన కొత్త నక్షత్రంగా ఏర్పడుతుంటాయి. ఇలాంటి పరిణామాన్ని కిలోనోవా అంటారు. మనం ఉంటున్న నక్షత్ర మండలంలో మరో అరుదైన కిలోనోవాకు అంకురార్పణ జరిగినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. భూగోళం నుంచి 11,000 కాంతి సంవత్సరాల దూరంలో రెండు న్యూట్రాన్‌ నక్షత్రాలు ఒకదానికొకటి ఢీకొట్టబోతున్నట్లు తేల్చారు. తొలుత నాసాకు చెందిన నీల్‌ గెహ్రెల్స్‌ స్విఫ్ట్‌ అబ్జర్వేటరీ శాస్త్రవేత్తలు గమనించారు. అనంతరం చిలీలో అమెరికన్‌ అబ్జర్వేటరీలో ఉన్న స్మార్ట్‌ 1.5 మీటర్‌ టెలిస్కోప్‌ సాయంతో కిలోనోవా పరిణామాన్ని నిర్ధారించారు.

అధ్యయనం ఫలితాలను నేచర్‌ జర్నల్‌లో ప్రచురించారు. త్వరలో సంభవించబోయే కిలోనోవా కోసం శాస్త్రవేత్తలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రెండు నక్షత్రాలు కలిసిపోయినప్పుడు భారీ పేలుడు సంభవిస్తుందని, ఇందులో బంగారం లాంటి లోహాలు ఉత్పత్తి అవుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా నక్షత్రాలు, గ్రహాల పుట్టుకతోపాటు అంతరిక్ష రహస్యాలను ఛేదించేందుకు ఈ కిలోనోవా దోహదపడుతుందని భావిస్తున్నారు. విశ్వంలో ఇప్పటిదాకా 10 కిలోనోవాలో సంభవించినట్లు అంచనా వేస్తున్నారు. ఒక భారీ నక్షత్రం జీవితకాలం కనీసం 10 లక్షల సంవత్సరాలు ఉంటుందని, ఆ తర్వాత అందులో పేలుడు జరిగి, న్యూట్రాన్‌ స్టార్‌ ఉద్భవిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు వివరించారు.

మరిన్ని వార్తలు :

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top