నక్షత్రాల సమూహం.. ఆర్‌ఆర్‌ లైర్‌.. ఆండ్రోమెడాకు ఏకంగా సగం దూరంలో

A Recently Discovered Gas Cloud Near Andromeda Stumps Astronomers - Sakshi

వాషింగ్టన్‌: మన పాలపుంతలో అత్యంత సుదూరంలో ఉన్న నక్షత్రాల సమూహాన్ని తాజాగా గుర్తించారు. ఆర్‌ఆర్‌ లైర్‌గా పిలుస్తున్న ఈ తారలు పాలపుంత చివరి అంచుల్లో, మనకు అతి సమీపంలో ఉన్న నక్షత్ర మండలమైన ఆండ్రోమెడాకు ఏకంగా సగం దూరంలో ఉండటం విశేషం! ఇప్పటిదాకా కనీసం ఇలాంటి 200 నక్షత్రాలను గుర్తించారు. వీటిల్లో అత్యంత దూరాన ఉన్న నక్షత్రమైతే భూమి నుంచి ఏకంగా 10 లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది!

ఆండ్రోమెడా నక్షత్ర మండలం భూమి నుంచి 25 లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉందన్న సంగతి తెలిసిందే. మిగతా విశ్వంలో మాదిరిగా పాలపుంత చివరి అంచుల్లో అత్యధిక భాగం డార్క్‌ మ్యాటర్‌తోనే నిండి ఉంటుంది. విశ్వపు మౌలిక నిర్మాణానికి ఆధారం ఇదేనని భావిస్తారు. దీని గురుత్వాకర్షణ శక్తి కారణంగానే అంతరిక్షంలోని దృగ్గోచర ద్రవ్యరాశి ఒక్కచోటికి చేరి తారలు, తారా మండలాలు పుట్టుకొస్తాయన్నది శాస్త్రవేత్తల సిద్ధాంతం. ఈ పరిశోధన వల్ల పాలపుంత ఆవలి హద్దుల్లో ఏముందనే దానిపై కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయని దీనిలో భాగం పంచుకున్న యూసీ శాంతాక్రుజ్‌ ఆస్ట్రానమీ అండ్‌ ఆస్ట్రో ఫిజిక్స్‌ ప్రొఫెసర్‌ రాజగుహ ఠాకూర్త చెబుతున్నారు.

మరిన్ని వార్తలు :

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top