పసిపాపను పన్నెండుసార్లు పొడిచి పాతిపెట్టినా.. | Thai newborn survives after being stabbed, buried alive | Sakshi
Sakshi News home page

పసిపాపను పన్నెండుసార్లు పొడిచి పాతిపెట్టినా..

Feb 25 2016 4:09 PM | Updated on Sep 3 2017 6:25 PM

కత్తితో పొడిస్తే శారీరక దారుఢ్యం కలవారే ప్రాణాలు కోల్పోతారు. కానీ, థాయిలాండ్లో మాత్రం అప్పుడే పుట్టిన శిశువు మాత్రం బతికి బయటపడింది.

బ్యాంకాక్: కత్తితో పొడిస్తే శారీరక దారుఢ్యం కలవారే ప్రాణాలు కోల్పోతారు. కానీ, థాయిలాండ్లో మాత్రం అప్పుడే పుట్టిన శిశువు మాత్రం బతికి బయటపడింది. అది కూడా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పన్నెండు కత్తిపోట్లకు గురై. మరింత ఆశ్యర్యకర విషయమేంటంటే కత్తిపోట్లతోపాటు ఆ పసిగుడ్డును బతికుండగానే పాతిపెట్టి పోయినా ప్రాణాలతో తిరిగి లోకం చూసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. థాయిలాండ్లోని ఖాన్ కేన్ అనే ప్రావిన్స్లో పశువులను కాసేందుకు వెళ్లిన మహిళ అక్కడి పొలాల్లో పసిపాప ఏడుపును విన్నది. దగ్గరికి వెళ్లి చూడగా పాప ఒళ్లంతా కత్తితోపొడిచిన గాయాలు. పైగా ఆ గుంటతీసి అందులో పాపను పెట్టి పైన ఆకులు అలమలు కప్పి వెళ్లారు. ఆ పాపను చూసిన ఆమె చేతుల్లోకి తీసుకోవడమే కాకుండా పోలీసులకు సమాచారం ఇవ్వగా ఆపాపను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ పాప ఆరోగ్యం సురక్షితంగా ఉంది. పోలీసులు ఆ పాప తల్లిదండ్రుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. పాపకు కత్తి గాయాలు తల్లిదండ్రులు చేశారా? లేక వేరేవరైనా చేసి ఉంటారా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement