మీడియా ముందు థాయ్‌ చిన్నారులు

Thai Cave Boys Play Football At Press Conference - Sakshi

బ్యాంకాక్‌: థాయ్‌లాండ్‌లోని థామ్‌ లువాంగ్‌ గుహలో చిక్కుకుని 18 రోజుల నరకం తర్వాత బయటపడిన పిల్లలు, వారి ఫుట్‌బాల్‌ జట్టు కోచ్‌ తొలిసారి ప్రజల ముందుకొచ్చారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ చిన్నారులు, వారికి చికిత్స అందిస్తున్న వైద్యులతో కలసి పాల్గొన్నారు. ఈ సమావేశంలో చిన్నారులు మాట్లాడుతూ.. గుహలో తాము ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులను మీడియాతో పంచుకున్నారు. తొలుత చిన్నారులు అందరికి నమస్కారం చెబుతూ, ఫుట్‌బాల్ చేతిలో పట్టుకొని వేదికగా వద్దకు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన స్థలంలో కొద్ది సేపు ఫుట్‌బాల్‌ ఆడారు. వారు సరాదాగా ఫుట్‌బాల్‌ ఆడిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

కాగా చిన్నారుల ఆరోగ్య పరిస్థితులపై వస్తున్న తప్పుడు వార్తలకు డాక్టర్లు తెరదించారు. వారు మాట్లాడుతూ.. చిన్నారులతో పాటు వారి కోచ్‌ కూడా ఆరోగ్యంగా ఉన్నట్టు వెల్లడించారు. వారందరి బరువు సరాసరిగా 3 కేజీలు పెరిగినట్టు తెలిపారు. కాగా గత నెల 23న ‘వైల్డ్‌ బోర్స్‌’ అనే ఫుట్‌బాల్‌ జట్టు సభ్యులైన 12 మంది పిల్లలు (అందరి వయసు 11–16 ఏళ్ల మధ్య) సాధన తర్వాత తమ కోచ్‌తో కలిసి గుహలోకి సాహస యాత్రకు వెళ్లి చిక్కుకుపోగా వారందరినీ కాపాడటానికి 18 రోజులు పట్టడం తెలిసిందే. గురువారం వైద్యులు చిన్నారులను వారి ఇళ్లకు పంపిచనున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top