ఇద్దరు కూతుళ్లను కాల్చి.. | Texas mom killed by police after shooting dead her two daughters | Sakshi
Sakshi News home page

ఇద్దరు కూతుళ్లను కాల్చి..

Jun 26 2016 2:19 PM | Updated on Sep 4 2017 3:28 AM

అమెరికా లోని హోస్టన్ లో దారుణం జరిగింది.

అమెరికా లోని హోస్టన్ లో దారుణం జరిగింది. కన్నతల్లి తన ఇద్దరు టీనేజ్ కూతుళ్లను రివాల్వర్ తో కాల్చిచంపింది. శుక్రవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఓ ఇంటి నుంచి తుపాకీ మోత వినిపించడంతో దగ్గరలో ఉన్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే ప్రాణాలు విడిచిన కూతుళ్లలో ఒకరిని తిరిగి కాల్చబోతుండగా పోలీసులు ఆమెపై కాల్పులు జరిపారు.

దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. కాగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. కుటుంబ సభ్యులతో గొడవ కారణంగానే ఆమె తన పిల్లలను కాల్చేసి ఉంటారని భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు.

Advertisement
 
Advertisement
Advertisement