సగం ఉగ్రదాడులు ఐదు దేశాల్లోనే | Terrorist attacks in half of the five countries | Sakshi
Sakshi News home page

సగం ఉగ్రదాడులు ఐదు దేశాల్లోనే

Jun 4 2016 1:57 AM | Updated on Apr 4 2019 5:12 PM

ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది జరిగిన ఉగ్రదాడుల్లో సగానికిపైగా దాడులు భారత్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, ఇరాక్, నైజీరియా దేశాల్లోనే చోటుచేసుకున్నాయని అమెరికా అధికారులు వెల్లడించారు.

వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది జరిగిన ఉగ్రదాడుల్లో సగానికిపైగా దాడులు భారత్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, ఇరాక్, నైజీరియా దేశాల్లోనే చోటుచేసుకున్నాయని అమెరికా అధికారులు వెల్లడించారు.  ఉగ్రవాద దాడుల మరణాల్లో  74 శాతం ఈ దేశాల్లోనే  చోటుచేసుకుంటున్నాయని అమెరికా ఉగ్రవాద నిరోధక సమన్వయకర్త జస్టిన్ సిబిరెల్ తెలిపారు.

గత ఏడాది 92 దేశాల్లో జరిగిన ఉగ్రదాడుల సమాచారాన్ని మేరీల్యాండ్ వర్సిటీ క్రోడీకరించి విశ్లేషించింది. ఈ సమాచారం ఆధారంగా జస్టిన్ సిబిరెల్ మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులు దృష్టి కేంద్రీకరించారని..2014లో జరిగిన ఉగ్రదాడులతో పోలిస్తే 2015లో 13శాతం వరకు తగ్గుముఖం పట్టాయన్నారు. 2012 నుంచి జరిగిన ఉగ్రదాడులతో పోలిస్తే 2015లో ఉగ్రదాడులు తగ్గుముఖం పట్టినట్లేనని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement