సన్నబడాలని.. సిగరెట్లు ఊదేస్తున్నారు!! | Teens who feel too fat, light up cigarettes to slim down | Sakshi
Sakshi News home page

సన్నబడాలని.. సిగరెట్లు ఊదేస్తున్నారు!!

Oct 17 2016 6:46 PM | Updated on Oct 22 2018 2:06 PM

సన్నబడాలని.. సిగరెట్లు ఊదేస్తున్నారు!! - Sakshi

సన్నబడాలని.. సిగరెట్లు ఊదేస్తున్నారు!!

లావుగా ఉన్నామని.. అధిక బరువుతో ఉన్నామని అనుకునే టీనేజర్లు మాత్రం వ్యాయామం చేయడానికి బదులు సింపుల్‌గా సిగరెట్లు ఊదేస్తున్నారట.

లావుగా ఉన్నప్పుడు సన్నబడాలంటే ఏం చేయాలి? తగినంత వ్యాయామం చేస్తూ, ఆహారపు అలవాట్లను కొద్దిగా మార్చుకోవాలి. కానీ, తాము లావుగా ఉన్నామని.. అధిక బరువుతో ఉన్నామని అనుకునే టీనేజర్లు మాత్రం వ్యాయామం చేయడానికి బదులు సింపుల్‌గా సిగరెట్లు ఊదేస్తున్నారట. ఈ విషయం తాజా పరిశోధనలలో వెల్లడైంది. అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీ ఈ అంశంపై పరిశోధనలు చేసింది. అమ్మాయిలలో 46 శాతం, అబ్బాయిలలో 30 శాతం మంది ఇలా సిగరెట్లు కాలుస్తున్నారట. అసలు తమ బరువు గురించి పెద్దగా పట్టించుకోని, లేదా సరైన బరువులోనే ఉన్నామని చెప్పేవాళ్లకంటే.. తాము చాలా ఎక్కువ లావుగా ఉన్నామని భావించే అమ్మాయిలు 225 శాతం ఎక్కువగా సిగరెట్లు కాలుస్తున్నారు. అబ్బాయిలు కూడా ఇలా చేస్తున్నా, వాళ్లకు సమాజం నుంచి ఎదురయ్యే ఒత్తిడి అమ్మాయిల కంటే తక్కువగా ఉండటంతో వాళ్లు సిగరెట్లు కాల్చడం కూడా తక్కువగానే ఉంటోందని అంటున్నారు.

అసలు యువతీ యువకులు ఇలా ఆరోగ్యానికి హాని కలిగించే పనులు ఎందుకు చేస్తున్నారో అర్థం చేసుకోడానికి ఈ పరిశోధన బాగా ఉపయోగపడిందని కార్నెల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జాన్ కాలీ తెలిపారు. వందేళ్ల క్రితం టీబీ, ఇన్‌ఫ్లూయెంజా లాంటి వ్యాధులతో ఎక్కువగా చనిపోయేవారని, కానీ ఇప్పుడు మనం కోరి తెచ్చుకునే జబ్బులతోనే త్వరగా చనిపోతున్నారని ఆయన అన్నారు. పిల్లల్లో పొగతాగే అలవాటు విషయం తేల్చడానికి2001-02 నుంచి 2005-06 వరకు 11, 13, 15 ఏళ్ల వయసున్న దాదాపు 10,500 మంది అమెరికన్ స్కూలు విద్యార్థులతో సర్వే చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement